పాత ఫోటోని, ‘LAC వద్ద చైనా దాడుల్లో గాయపడిన భారతీయ జవాను’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

ఒక వ్యక్తి వీపు పైన గాయాలు ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది LAC వద్ద చైనా దాడుల్లో గాయపడిన భారతీయ జవాను ఫోటో అని చెప్తున్నారు. భారత్ మరియు చైనా సైన్యాల మధ్య 15 జూన్ 2020న గాల్వాన్ వ్యాలీ లో ఘర్షణలు జరిగాయి. ఆ ఘర్షణల్లో సుమారు ఇరవై మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, పోస్టు లోని ఫోటో పాతదని FACTLY విశ్లేషణ లో తెలిసింది. ఆ ఫోటో 2016 నుండి అనేక దేశాల బ్లాగుల్లో ఉన్నట్లుగా ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ ఫోటో లో ఉన్నది ఏ దేశానికి చెందిన సైనికుడిదనే ఖచ్చితమైన సమాచారమేమీ లభించలేదు. కానీ అది 2016 నుండి సోషల్ మీడియా లో చలామణీ లో ఉంది. కాబట్టి దానికి మరియు తాజాగా భారత్ -చైనా మధ్య జరిగిన ఘర్షణకు ఎటువంటి సంబంధం లేదని చెప్పవచ్చు.  

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. బ్లాగ్ కథనం – http://kaupyime.blogspot.com/2016/11/4.html
2. బ్లాగ్ కథనం – https://blogmazeer.blogspot.com/2016/05/ingat-senang-nak-jadi-komando-saksikan.html
3. బ్లాగ్ కథనం – https://bulletinmedia.blogspot.com/2016/08/gilaa-15-foto-sulit-latihan-komando.html

Did you watch our new video?