Fake News, Telugu
 

సంబంధంలేని పాత వీడియోలను రైతుల నిరసనలలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు అని షేర్ చేస్తున్నారు

0

కొందరు నిరసనకారులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్న వీడియో మరియు ఒక వ్యక్తి భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వీడియో కలిసి ఉన్న ఒక వీడియో కొల్లాజ్ ని కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న అందోళనలకు ముడిపెడుతూ షేర్ చేస్తున్న ఇలాంటి పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతుల ఆందోళనల్లో ఖలిస్తాన్ కి అనుకూలంగా మరియు భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నిరసనలకారులు.

ఫాక్ట్ (నిజం): ఖలిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీడియో 2019లో న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న నేపధ్యంలో కాశ్మీర్ లో మానవ హక్కుల కోసం కొందరు నిరసనకారులు మోదీకి వ్యతిరేకంగా జరిపిన నిరసనలకు సంబంధించింది. భారత్ కి వ్యతిరేకంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్న వీడియో పాకిస్తాన్ కి సంబంధించింది. ఈ వీడియోలకి కొత్త వ్యవసాయ చట్టలకి వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వీడియో 1(ఎడమ) :

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అచ్చం ఇలాంటి వీడియో షేర్ చేసిన ఒక 2019 ఫేస్బుక్ పోస్టు మాకు కనిపించింది. దీన్నిబట్టి ఈ వీడియో చాలా రోజులనుండి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉందని చెప్పొచ్చు.

పాత పోస్టులో ఉన్న వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే నిరసనకారులు పట్టుకున్న పోస్టర్స్ పై ‘న్యూయార్క్’ మరియు ‘అమెరికా జెండాపై మోదీ’ అని రాసి ఉండడం గమనించొచ్చు.

వీటి ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2019లో న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తున్న నేపధ్యంలో కాశ్మీర్ లో మానవ హక్కుల కోసం కొందరు నిరసనకారులు మోదీకి వ్యతిరేకంగా జరిపిన నిరసనలకు సంబంధించిన వార్తలు ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకి కనిపించాయి, వీటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇంకా కీవర్డ్ సెర్చ్ ద్వారా ఐక్యరాజ్యసమితి హెడ్ క్వార్టర్స్ వెలుపల జరిగిన నిరసనలకి సంబంధించిన వీడియోలని చెప్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్టులు మాకు కనిపించాయి. ఈ పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తేదీ, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిచిన తేదీ మ్యాచ్ అవుతుండడం గమనించొచ్చు. ఈ వీడియోలో నిరసనకారులు వేసుకున్న టీషర్ట్స్ పై ‘New York City Protest at the UN’ రాసి ఉండడం చూడొచ్చు. పైగా ఈ వీడియోస్ లో నిరసనకారులు పట్టుకున్న పోస్టర్స్ పోస్టులో ఉన్న వీడియోలో నిరసనకారులు పట్టుకున్న పోస్టర్స్ ఒకేలా ఉండడం మరియు రెండు వీడియోల్లో నిరసనకారుల వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్స్ ఒకేలా ఉండడం గమనించొచ్చు. వీటన్నిటి ఆధారంగా పోస్టులోని వీడియో 2019లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ప్రసంగిస్తున్నప్పుడు జరిగిన నిరసనలకు సంబంధించిందని, ఈ వీడియోకి  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న అందోళనలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

వీడియో 2 (కుడి):

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వీడియోలోని విజువల్స్ పోలిన ఫోటోని ప్రచురించిన ఒక 2019 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో ‘నయా పాకిస్తాన్’ అనే పాకిస్తాన్ కి చెందిన యూట్యూబ్ ఛానల్ కర్తార్‌పూర్ కారిడార్ లోకి భారత్ లోని భక్తులను అనుమతించడంపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్న సందర్భానికి సంబంధించింది.

ఈ వార్తా కథనం ఆధారంగా యూట్యూబ్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా పోస్టులో ఉన్న వీడియోకి సంబంధించిన ఎక్కువ నిడివి ఉన్న వీడియో మాకు కనిపించింది. పోస్టులో ఉన్న వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కర్తార్‌పూర్ కారిడార్ లోకి భారత్ లోని భక్తులను అనుమతించడంపై తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు ఈ మాటలు అనడం చుడోచ్చు. ఐతే వీటి ఆధారంగా వీడియోలో మాట్లాడిన వ్యక్తి పాకిస్తాన్ కి చెందిన వాడని, ఈ వీడియోకి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న అందోళనలకు ఎటువంటి సంబంధంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, సంబంధంలేని పాత వీడియోలను రైతుల నిరసనలలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll