కరోనావైరస్ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని పెట్టిన ఈ లిస్ట్ ని ICMR ప్రకటించలేదు

రాబోయే 6-12 నెలలు వరకు కరోనావైరస్ వ్యాధి సోకకుండా పాటించాల్సిన నియమాల లిస్ట్ అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అది  ICMR (ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్) ప్రకటించిన నియమాలు అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ, FACTLY అలాంటి లిస్ట్ ఏది ICMR ప్రకటించలేదని తెలుసుకుంది. ఆ విషయం గురించి ICMR ని సంప్రదించగా, అలాంటి నియమాలు ఏవైనా ఉంటే వాటిని వారు తమ వెబ్సైట్ లో కానీ అధికారిక  సోషల్ మీడియా హేండిల్ లో కానీ పెడతాము అని చెప్పారు. ICMR కి సంబంధించిన ఏ వెబ్సైట్  లో  కూడా పోస్ట్ లో పేర్కొన్న నియమాల లిస్ట్ కనిపించలేదు. 

ICMR తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ లోని కోవిడ్-19 మార్గదర్శకాలు తాముజారీ చేయలేదని, పోస్టులోని మార్గదర్శకాలు తమకు తప్పుగా ఆపాదిస్తున్నారని స్పష్టతని ఇచ్చారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ICMR వెబ్సైట్ – https://main.icmr.nic.in/
2. ICMR ట్విట్టర్ – https://twitter.com/ICMRDELHI

వివరణ (MAY 07, 2021): ఈ ఆర్టికల్ ICMR 06 మే 2021న వివరణ ఇచ్చిన ట్వీట్ ద్వారా అప్డేట్ చేయటం జరిగింది.

Did you watch our new video?