ఫేస్బుక్ వాడే వారిలో ఆడ వారి శాతం కేవలం 1.6% మాత్రమే అని చెప్తూ ఒక గ్రాఫ్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ : ఫేస్బుక్ వాడే వారిలో ఆడవాళ్ళు 1.6% ఉంటే, మగవాళ్ళు 98.4% ఉన్నారు.
ఫాక్ట్ (నిజం): ‘Forbes’ ఆర్టికల్ ప్రకారం ఫేస్బుక్ వాడే వారిలో 43% ఆడవాళ్ళు మరియు 57% మగవాళ్ళు ఉన్నారు. భారత దేశం డేటా తీసుకుంటే ఆడవారి శాతం కొంచం తక్కువ ఉన్నట్టు ‘Quartz India’ ఆర్టికల్ లో చుడవొచ్చు. కానీ, పోస్ట్ లో చెప్పినట్టు 2% కంటే తక్కువ మాత్రం కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో ఇచ్చిన విషయం గురించి గూగుల్ లో ‘Facebook Gender Statistics’ అని వెతకగా, ‘Forbes’ ఆర్టికల్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం ఫేస్బుక్ వాడే వారిలో 43% ఆడవాళ్ళు ఉంటే, 57% మగవాళ్ళు ఉన్నారు. ఈ డేటాకి సంబంధించిన గ్రాఫ్ ని ‘Statista’ వెబ్ సైట్ లో చుడవొచ్చు.
భారత దేశం డేటా తీసుకుంటే ఆడవారి శాతం కొంచం తక్కువ (24%) ఉన్నట్టు ‘Quartz India’ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇదే విషయాన్ని ‘The Next Web’ వారి ఆర్టికల్ లో కూడా చూడవొచ్చు. ఇండియా డేటాకి సంబంధించిన గ్రాఫ్ ని కూడా‘Statista’ వెబ్ సైట్ లో చుడవొచ్చు. దేంట్లో కూడా ఆడ వారి శాతం 1.6% లేదు.
చివరగా, ‘ఫేస్బుక్ వాడే వారిలో ఆడవాళ్ళు కేవలం 1.6%’ అని వస్తున్న పోస్టుల్లో నిజం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ‘ఫేస్బుక్ వాడే వారిలో ఆడవాళ్ళు కేవలం 1.6%’ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు - Fact Checking Tools | Factbase.us