‘Kanchi Kamakoti CHILDS Trust Hospital’ లో ఉచిత వైద్యం అందించరు.

చెన్నై లోని ‘Kanchi Kamakoti CHILDS Trust Hospital’ లో పిల్లలకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్నారని, ఈ విషయం అందరికి తెలియచేయమని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. 2016 లో పెట్టిన ఆ పోస్ట్ ని ఇప్పటికీ షేర్ చేస్తున్నారు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి దాదాపు మూడున్నర లక్షల మందికి పై ఆ పోస్ట్ ని షేర్ చేసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : పిల్లలకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తున్న ‘Kanchi Kamakoti CHILDS Trust Hospital’.

ఫాక్ట్ (నిజం): తమ హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అసలు అందించమని, కాకపోతే తమది ‘not-for-profit’ హాస్పిటల్ అయినందున తక్కువ ధరలకే వైద్యం అందిస్తామని ‘Kanchi Kamakoti CHILDS Trust Hospital’ వారు వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురింఛి గూగుల్ లో ‘ Kanchi Kamakoti Hospital Free Treatment’ అని వెతకగా, ఆ హాస్పిటల్ వెబ్ సైట్ లోని ‘FAQ’ సెక్షన్ యొక్క లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. తాము పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తామని వాట్సాప్ మరియు ఫేస్బుక్ లలో వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదని ఆ వెబ్ సైట్ లో వారు రాసినట్టు చుడవొచ్చు. కాకపోతే తమది ‘not-for-profit’ హాస్పిటల్ అయినందున తక్కువ ధరలకే వైద్యం అందిస్తామని ‘Kanchi Kamakoti CHILDS Trust Hospital’ వారు తెలిపారు. ఇదే విషయాన్ని చెప్తూ తమ ఫేస్బుక్ అకౌంటులో కూడా పోస్ట్ చేసారు.

అంతేకాదు, తమ మిషన్ స్టేట్మెంట్ లో కూడా తాము ‘fair and affordable cost’ లో వైద్యం అందిస్తామని పెట్టినట్టు చూడవొచ్చు.

చివరగా, ‘Kanchi Kamakoti CHILDS Trust Hospital’ లో ఉచిత వైద్యం అందించరు. అది ఒక ఫేక్ మెసేజ్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?