Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్న నిషా సింగ్ అనే మహిళ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా భార్య కాదు

0

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సతీమణి నిషా సింగ్‌కు 7 ఏళ్ళ జైలుశిక్ష…!’ అని ఒక వార్తా కథనం క్లిప్ ఒకటి సోషల్ మీడియా పోస్టు ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ పేపర్ కటింగ్ ప్రకారం, ఈ వార్త ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెలుగులోకి రాలేదు, సోషల్ మీడియాలోనే వైరల్ అవుతోంది. అసలు ఈ పోస్టులోని క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సతీమణి నిషా సింగ్‌కు 7 ఏళ్ళ జైలుశిక్ష.

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్న పేపర్ కటౌట్‌లో ఉన్న మహిళ గురుగావ్ మాజీ మునిసిపల్  కౌన్సిలర్ నిషా సింగ్. 2015లో ఒక గుంపును పోలీస్ మరియు గవర్నమెంటు అధికారులపై  దాడికి ప్రేరేపించిన నేరానికి తనకి కోర్టు 2022లో 7 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.  ఈమె మనీష్ సిసోదియా సతీమణి కాదు. మనీష్ సిసోదియా సతీమణి పేరు సీమా సిసోదియా. కావున పోస్టులో చేస్తున్న క్లెయిము తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిము వెనుక ఉన్న నిజానిజాలను పరిశీలించడానికి ఇంటర్నెట్లో సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి సెర్చ్ చేయగా, నిషా సింగ్ అనే మహిళకి 2022లో జైలు శిక్ష ఖరారు అయినట్లు ఉన్న కొన్న వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియి ఇక్కడ) మాకు లభించాయి. ఇండియన్ ఎక్సప్రెస్ వారి కథనంలో నిషా సింగ్ ఫోటో ఉంది. ఇది మరియు వైరల్ పోస్టులో ఉన్న ఫోటో ఒకటే.

వార్తా కథనాల ప్రకారం నిషా సింగ్ గురుగావ్ యొక్క మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేసారు. 2015లో ఒక గుంపును పోలీస్ మరియు గవర్నమెంటు అధికారులపై దాడికి ప్రేరేపించారనే  నేరానికి గాను తనకి ఒక స్థానిక కోర్టు 2022లో 7 ఏళ్ళ జైలుశిక్ష విధించింది.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సతీమణి పేరు సీమా  సిసోదియా, ఇది తను 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించిన అఫిడెవిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

చివరిగా, ఈ ఫోటోలో ఉన్న నిషా సింగ్ అనే మహిళ, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా భార్య కాదు; తన భార్యా పేరు సీమా  సిసోదియా.

Share.

About Author

Comments are closed.

scroll