‘మౌంట్ ఎవరెస్ట్’ నేపాల్ మరియు చైనా యొక్క టిబెటియన్ అటానమస్ రీజియన్ సరిహద్దు లో ఉంది.

చైనా వార్తా సంస్థ ‘CGTN’, ‘మౌంట్ ఎవరెస్ట్’ చైనా యొక్క టిబెటియన్  అటానమస్ రీజియన్ లో ఉందని పేర్కొన్నట్లుగా ఉన్న ఒక ట్వీట్  స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేసి, నేపాల్ లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ మీద చైనా కన్ను పడిందని చెప్తున్నారు.  ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నేపాల్ లో ఉన్న ‘మౌంట్ ఎవరెస్ట్’ పై చైనా కన్ను పడింది

ఫాక్ట్ (నిజం): మౌంట్ ఎవరెస్ట్’ నేపాల్ మరియు చైనా యొక్క టిబెటియన్ అటానమస్ రీజియన్ సరిహద్దులో ఉంది. మొత్తం నేపాల్ లో కాదు. కావున పోస్ట్ తప్పుద్రోవ పట్టించేలా ఉంది.

చైనా వార్తా సంస్థ ‘CGTN’, ‘మౌంట్ ఎవరెస్ట్’ చైనా యొక్క టిబెటియన్ అటానమస్ రీజియన్ లో ఉందని ‘2 మే 2020’ న కొన్ని ఫొటోలతో కూడిన ట్వీట్ చేసింది. ఆ విషయం పై నేపాల్ ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపించడంతో ‘CGTN’ ఆ ట్వీట్ ని డిలీట్ చేసి, ’10 మే 2020′ న మరొక ట్వీట్ పెట్టింది. ‘CGTN’ ఆ ట్వీట్ లో ‘మౌంట్ ఎవరెస్ట్’ చైనా మరియు నేపాల్ బోర్డర్ మీద ఉందని రాసింది. 

‘మౌంట్ ఎవరెస్ట్’ ని సంస్కృతం మరియు నేపాలీ లో ‘సాగరమాత’ అని, చైనీస్ లో ‘కొమోలంగ్మా ఫెంగ్’ అని సంబోధిస్తారు. ‘మౌంట్ ఎవరెస్ట్’ నేపాల్ మరియు చైనా యొక్క టిబెటియన్ అటానమస్ రీజియన్ సరిహద్దులో ఉన్నట్లుగా ‘Encyclopedia Britanica’ కథనం లో చూడవచ్చు. అదే విషయాన్ని ‘National Geographic’ వారు ‘మౌంట్ ఎవరెస్ట్’ గురించి రాసిన కథనం లో కూడా చూడవచ్చు. 

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టు ‘మౌంట్ ఎవరెస్ట్’ మొత్తం నేపాల్ లో లేదు. అది నేపాల్ మరియు చైనా యొక్క టిబెటియన్ అటానమస్ రీజియన్ సరిహద్దులో మీద ఉంది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?