పతంజలి లోగోతో ఉన్న బీఫ్ బిర్యానీ రెసిపీ మిక్స్ ప్యాకెట్‌ను చూపించే ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) యోగా గురువు రాందేవ్ బాబా ఒక పక్క గోహత్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరోపక్క బీఫ్ బిర్యానీ అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు అంటూ షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: యోగా గురువు రాందేవ్ బాబా ఒకపక్క గోహత్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరోపక్క పతంజలి బీఫ్ బిర్యానీ అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాడు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటో మార్ఫింగ్ చేసినది. అసలు ఫోటో నేషనల్ ఫుడ్స్ లిమిటెడ్ అనే ఒక పాకిస్తాన్ ఆధారిత మల్టీ నేషనల్ ఆహార ఉత్పత్తుల కంపెనీకి సంబంధించింది. పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ రాందేవ్ బీఫ్ బిర్యానీ స్పైస్ మిక్స్‌ను విక్రయించలేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లెయిమ్ గురించి తెలుసుకోవడానికి మొదట మేము పతంజలి యొక్క అధికారిక అధికారిక ఈ కామర్స్ వెబ్‌సైట్‌లో బీఫ్ బిర్యానీకి సంబంధించిన ప్రోడక్ట్ ఏదైనా అమ్మబడుతుందా అని చూస్తే, మాకు వారి వెబ్‌సైట్‌లో అలాంటి ఉత్పత్తి ఏదీ కనిపించలేదు.
తరువాత, వైరల్ పోస్టులో ఉన్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, పాకిస్తాన్ ఆధారిత ఈ-కామర్స్ వెబ్సైట్ అయిన నేషనల్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఇదే బీఫ్ బిర్యానీ మిక్స్ ప్యాకెట్ విక్రయిస్తున్నట్టు మేము కనుగొన్నాం. ఈ ప్రొడక్టును అమెజాన్ వెబ్సైటులో కూడా అమ్మబడుతున్నట్టు మేము గమనించాం.
ఈ రెండు రిసెపీ మిక్స్ డబ్బాల యొక్క ఫోటోలను సరిపోల్చినప్పుడు అసలు డబ్బాపై ఉన్న నేషనల్ అనే పేరును రాందేవ్ అనే పేరుతో ఎడిట్ చేసి, పతంజలి అనే పదం డబ్బాపై జోడించబడింది అని మేము కనుగొన్నాము. వైరల్ మరియు అసలు ఫోటోల మధ్య వ్యత్యాసాన్ని కింద చూడవచ్చు.
దీని గురించి మరింత వెతికితే, నేషనల్ ఫుడ్స్ అనేది 1970 నుండి పనిచేస్తున్న ఒక మల్టీ నేషనల్ ఆహార సంస్థ అని, ఇది UAE (National Foods DMCC), the UK (National Foods Pakistan (UK) Ltd), and Canada (National Epicure Inc)లో సబ్సిడరీ సంస్థలతో దాదాపు 40 దేశాలలో తమ ఉత్పత్తులు అందిస్తుంది అని కనుగొన్నాము. నేషనల్ ఫుడ్స్ లిమిటెడ్ విక్రయించే కొన్ని ఇతర ఉత్పత్తులు ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, మార్ఫ్ చేసిన ఫోటోను, పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ రాందేవ్ బీఫ్ బిర్యానీ స్పైస్ మిక్స్‌ను అమ్ముతున్నట్టు షేర్ చేస్తున్నారు.