శ్రీనగర్ లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ మీద భారత జెండా ఎగరవేసినట్టు చెప్తూ పెట్టిన ఈ ఫోటో ఫోటోషాప్ చేసింది

‘నరేంద్ర మోదీ హయాంలో లాల్ చౌక్’ అని చెప్తూ, శ్రీనగర్ లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ మీద భారత జెండా ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ జెండాని ఎగరవేసినట్టు చెప్తూ కూడా కొందరు అదే ఫోటోని పోస్ట్ (ఆర్కైవ్డ్) చేసారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ మీద భారతదేశ జెండా ఎగురుతున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిటెడ్ ఫోటో. శ్రీనగర్ లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ పాత ఫోటోని తీసుకొని అందులో భారతదేశ జెండాని పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో 2010 లో ప్రచురించిన ఒక బ్లాగ్ పోస్ట్ లో లభించింది. అయితే, ఆ ఫోటోలో క్లాక్ టవర్ మీద భారతదేశ జెండా లేనట్టు చూడవొచ్చు. భారతదేశ జెండా లేని క్లాక్ టవర్ పాత ఫోటోని 2010 తరువాత పలు వార్తాసంస్థలు కూడా ప్రచురించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ మీద భారతదేశ జెండా ఎగరవేసినట్టు ఎక్కడా కూడా ఎవరూ రిపోర్ట్ చేయలేదు.

ఫోటోలోని జెండాని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ జెండా ఫోటోని ‘పిక్సాబే’ వెబ్సైటులో నుండి తీసుకున్నట్టు తెలుస్తుంది ‘పిక్సాబే’ లోని జెండా ఫోటోని తీసుకొని, పాత లాల్ చౌక్ క్లాక్ టవర్ ఫోటోలో పెట్టారు. ఆ ఎడిటింగ్ ప్రక్రియని కింద గిఫ్ లో చూడవొచ్చు.

అయితే, పోస్ట్ లో ఉన్న మరో ఫోటోలోని ఘటన మాత్రం నిజంగానే 2010 లో జరిగింది. ఆ ఘటనకి సంబంధించిన వివరాలు ఇక్కడ చదవొచ్చు. ఆ ఘటనకి సంబంధించిన మరిన్ని ఫోటోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లాల్ చౌక్ లోని క్లాక్ టవర్ మీద భారతదేశ జెండా ఎగరవేసినట్టు చెప్తూ పెట్టినది ఒక ఎడిటెడ్ ఫోటో.

Did you watch our new video?