“పట్టపగలు బ్యాంకును దోచుకోవడానికి వచ్చి ఇలా పోలీసులకు దొరికిపోయారు” అని అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. వీడియోలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను పట్టుకుంటున్నట్టు చూడొచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పట్టపగలు బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన దొంగలను పోలీసులు పట్టుకున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియోలో జరిగినది నిజమైన దొంగతనం కాదు, ఒక మాక్ డ్రిల్ మాత్రమే. అహ్మద్‌నగర్‌లోని షెండి గ్రామంలో గ్రామ సురక్షా దళ్ ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి గ్రామంలోని వివిధ ప్రదేశాలలో భద్రతా వ్యవస్థలను పరీక్షించడానికి పోలీసులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న యూట్యూబ్ వీడియో ఒకటి లభించింది. 03 సెప్టెంబర్ 2021న అప్లోడ్ చేసిన ఈ యూట్యూబ్ వీడియోలో, ఈ సంఘటన అహ్మద్‌నగర్ పోలీసులకు సంబంధించిన ఒక మాక్ డ్రిల్ అని తెలిపారు.
ఈ వీడియో అహ్మద్‌నగర్ పోలీసులకు సంబంధించి అయ్యుంట్టుందన్న క్లూతో గూగుల్‌లో వెతకగా మహారాష్ట్ర టైమ్స్ వారు ప్రచురించిన ఆర్టికల్ లభించింది. అదే విజువల్స్‌తో ఉన్న ఒక వీడియో రిపోర్ట్ కూడా ఆ ఆర్టికల్‌లో చూడొచ్చు. 01 సెప్టెంబర్ 2021న పబ్లిష్ చేసిన ఈ ఆర్టికల్‌లో, అహ్మద్‌నగర్‌లోని షెండి గ్రామంలో గ్రామ సురక్షా దళ్ మాక్ డ్రిల్ జరిగింది అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడానికి గ్రామంలోని వివిధ ప్రదేశాలలో భద్రతా వ్యవస్థలను పరీక్షించడానికి పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
ఈ వీడియో రిపోర్టులో అహ్మద్‌నగర్ పోలీస్ ఇనస్పెక్టర్ అనిల్ కట్కే మాట్లాడుతూ ఇది జిల్లాలో జరిగిన రెండవ మాక్ డ్రిల్ అని తెలిపారు. భద్రతా వ్యవస్థలను పరీక్షించడానికి ఇటువంటి మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలిపారు.
చివరగా, అహ్మద్‌నగర్ పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ వీడియోను పట్టుకొని బ్యాంకును దోచుకోవడానికి వచ్చిన దొంగలను పట్టుకున్న పోలీసులు అని అంటున్నారు.