వీడియోలో చైనా SWAT బృందం పట్టుకుంటున్న వారికి నిజంగా కొరోనా వైరస్ సోకలేదు. అది కేవలం ఒక మాక్ డ్రిల్

ఫేస్బుక్ లో ఒక వీడియో ని పోస్టు చేసి, అది చైనా లో కొరోనా వైరస్ సోకిన వారిని అక్కడి అధికారులు పట్టుకోవడానికి సంబంధించినదని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: చైనా లో కొరోనా వైరస్ సోకిన వారిని అక్కడి అధికారులు పట్టుకుంటున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఉన్నది ‘మాక్ డ్రిల్’ వీడియో. అందులో చైనా SWAT బృందం కొరోనా వైరస్ సోకిన వారిని పట్టుకోవడం ‘ప్రాక్టీస్’ చేస్తున్నారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

వీడియోలో ఉన్న వ్యక్తుల దుస్తులపై ‘SWAT’ అని ఉండడం చూడవచ్చు. కావున, గూగుల్ లో ‘SWAT team Coronavirus’ అని వెతికినప్పుడు, అదే వీడియోతో ఉన్న‘Global News’  వారి కథనం లభించింది. దాని ద్వారా, ఆ వీడియోలో చైనా SWAT బృందం కొరోనా వైరస్ సోకిన వారిని పట్టుకోవడం ‘ప్రాక్టీస్’ చేస్తున్నారని తెలిసింది. అదే విషయాన్ని ‘Telegraph’ వారి వీడియో లో కూడా చూడవొచ్చు.

చివరగా, వీడియోలో చైనా SWAT బృందం కొరోనా వైరస్ సోకిన వారిని పట్టుకోవడం ‘ప్రాక్టీస్’ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?