తమను తమ స్వస్థలాలకు పంపించమని కోరుతూ వలస కార్మికులు టోలి చౌకి లో రోడ్ల పైకి వచ్చిన వీడియో అది

‘ఇది మన హైదరబాద్ పాతబస్తీలో పరిస్థితి’ అని చెప్తూ, కొంత మంది జనం రోడ్లపైకి వచ్చిన ఒక వీడియోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరబాద్ పాతబస్తీకి సంబంధించిన వీడియో. 

ఫాక్ట్ (నిజం):పోస్టులోని వీడియోని టోలి చౌకి లో తీసారు. లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుకున్న వలస కార్మికులు తమను తమ స్వస్థలాలకు పంపించమని కోరుతూ రోడ్ల పైకి వచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు. 

పోస్టులోని వీడియో గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ సంఘటన టోలి చౌకి లో జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు, వీడియోలో కనిపిస్తున్న కొన్ని షాప్స్ కూడా గూగుల్ మాప్స్ లో టోలి చౌకి లోనే ఉన్నట్టు చూడవొచ్చు

లాక్ డౌన్ కారణంగా తెలంగాణలో చిక్కుకున్న వలస కార్మికులు తమను తమ స్వస్థలాలకు పంపించమని కోరుతూ రోడ్ల పైకి వచ్చారని వీడియోలోని ఘటన గురించి మీడియా సంస్థలు ప్రచురించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

తమను తమ ఇళ్లకు పంపించమని వలస కార్మికులు అడుగుతున్న వీడియోని ఇక్కడ చూడవొచ్చు. ఈ ఘటనపై పోలీసులు ఇచ్చిన వివరణ ఇక్కడ చూడవొచ్చు.

చివరగా తమను తమ స్వస్థలాలకు పంపించమని కోరుతూ వలస కార్మికులు టోలి చౌకి లో రోడ్ల పైకి వచ్చిన వీడియో.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?