ఈ వీడియోలో బురఖా ధరించిన వ్యక్తి ఒక మానసిక రోగి, CAA నిరసనలలో హిందూవాది కాదు

ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, ‘హిందూ వాదులు బురఖా ధరించి CAA, NRC, NPR కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసి ఆడవారిలో చొరబడి అవమానించడానికి ప్రయత్నించారట. ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది’ అని దాని గురించి పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హిందూవాది బురఖా ధరించి CAA, NRC మరియు NPR లకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆడవారిలో చొరబడి అవమానించడానికి ప్రయత్నించి పట్టుబడిన వీడియో. 

ఫాక్ట్ (నిజం): బురఖా ధరించిన వ్యక్తి గోవాకి చెందిన ‘విర్గిల్ బోస్కో ఫెర్నాండెజ్’. ఆయన ఒక మానసిక రోగి. ఫెర్నాండెజ్ బురఖా ధరించి, పనాజి బస్ స్టాండ్ వద్ద మహిళల టాయిలెట్లోకి ప్రవేశించినందుకు గానూ అక్కడి వారు అతన్ని పట్టుకున్నారు. ఆ ఘటన ఫిబ్రవరి 2019 లో జరిగింది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో గతంలో వేరే ఆరోపణతో సోషల్ మీడియా లో చలామణి అయినప్పుడు, ‘FACTLY’ అది తప్పని చెప్తూ గతంలోనే ఫాక్ట్ చెక్ ఆర్టికల్రాసింది. దాని ప్రకారం, వీడియో లో బురఖా ధరించి ఉన్న వ్యక్తి గోవాకి చెందిన ‘విర్గిల్ బోస్కో ఫెర్నాండెజ్’. ఆయన ఒక మానసిక రోగి. గత కొద్ది  కాలంగా మతి స్థిమితంగా లేకపోవడంతో ఆయన హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఫెర్నాండెజ్ బురఖా ధరించి, పనాజి బస్ స్టాండ్ వద్ద మహిళల టాయిలెట్లోకి ప్రవేశించినందుకు గానూ అక్కడి వారు అతన్ని పట్టుకుని పోలీసులకి అప్పగించారు. ఆ ఘటన ఫిబ్రవరి 2019 లో జరిగింది.

చివరగా, పోస్టులోని వీడియో పాతది, CAA నిరసనలకు సంబంధించింది  కాదు. అందులో బురఖా ధరించిన వ్యక్తి ఒక మానసిక రోగి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?