మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సీ (NRC) లిస్ట్ కి సంబంధించి అమిత్ షా కి ఇచ్చిన డాక్యుమెంట్ పైన ‘జై శ్రీ రామ్’ అని ఫోటోషొప్ చేసారు

మమతా బెనర్జీ అమిత్ షా కి ఇస్తున్న డాక్యుమెంట్ పైన హిందీ లో ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియా లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ డాక్యుమెంట్ పైన నిజంగా జై శ్రీ రామ్ అని రాసి ఉందొ కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అమిత్ షా కి ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్న డాక్యుమెంట్ ఇస్తున్న మమతా బెనర్జీ.

ఫాక్ట్ (నిజం): మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సీ లిస్ట్ నుంచి నిజమయిన పౌరుల పేర్లు గల్లంతయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేస్తూ, లిస్ట్ ని పునఃసమీక్షించాల్సిందిగా
కోరుతూ అమిత్ షా కి ఇచ్చిన డాక్యుమెంట్ పైన ‘జై శ్రీ రామ్’ అని ఫోటోషొప్ చేసారు. కావున, పోస్టులో పెట్టిన ఫోటో అబద్ధం.

పోస్ట్ ఉన్న ఫోటో ఏ సంఘటనకు సంబంధించింది అని గూగుల్ లో ‘మమతా బెనర్జీ అమిత్ షా మీటింగ్’ అని వెతికితే అన్ని మీడియా సంస్థలు ఈ మీటింగ్ కి సంబంధించి ప్రచురించిన ఆర్టికల్స్ రిజల్ట్స్ లో వస్తాయి. రిజల్ట్స్ లో ఈ మీటింగ్ కి సంబంధించిన CVR NEWS వారు పెట్టిన వీడియో కూడా చూడొచ్చు.

ఇదే మీటింగ్ కి సంబంధించి ANI సంస్థ పెట్టిన ట్వీట్ కూడా మనం చూడొచ్చు. వీటన్నిటిలో ఎక్కడ కూడా అమిత్ షా కి ఇచ్చిన డాక్యుమెంట్ పైన హిందీ లో ‘జై శ్రీ రామ్’ అని రాసి ఉన్నట్టు మనకు కనిపించదు. మీడియా తో మమతా బెనెర్జీ మాట్లాడుతూ ఎన్‌ఆర్‌సీ లిస్ట్ నుంచి నిజమయిన పౌరుల పేర్లు గల్లంతయ్యాయని, లిస్ట్ ని పునసమీక్షించాల్సిందిగా కోరుతూ అమిత్ షా కి అఫీషియల్ లెటర్ ఇచ్చినట్టు చెబుతుంది. ఇదే విషయాన్నీ మిగతా వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ , ఇక్కడ చూడొచ్చు.

కావున, మమతా బెనర్జీ ఎన్‌ఆర్‌సీ లిస్ట్ ని పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ అమిత్ షా కి ఇచ్చిన డాక్యుమెంట్ పైన ‘జై శ్రీ రామ్’ అని ‌‌ఫోటోషాప్ చేసారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?