వీడియోలోని లుప్పో కేక్ భారత మార్కెట్ లో దొరకదు. ఆ కేక్ తిన్న పిల్లలకు పక్షవాతం రాదు.

మార్కెట్ లోకి లుప్పో కంపెనీ కేక్ వచ్చింది. దీంట్లో ఒక మాత్రా వేసి ఉంది. ఈ కేక్ తిన్న పిల్లలకు పక్షవాతం వస్తుంది’ అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లుప్పో కంపెనీ కేక్ తిన్న పిల్లలకు పక్షవాతం వస్తుంది.    

ఫాక్ట్ (నిజం): వీడియోలో చూపెట్టిన ‘Luppo Coconut Cream Bars’ ని కేవలం ఇరాక్ దేశంలో అమ్ముతారు. అంతేకాదు, వీడియోలో చూపెట్టిన మాత్రలను తయారు చేసిన కంపెనీ పెట్టలేదని ఆ కంపెనీ వారు తెలిపారు. తయారు చేసే సమయంలో అలాంటివి ఏవీ కూడా కేక్ లో ఉండే అవకాశం లేదని తెలిపారు.పోస్టులో చెప్పిన దాంట్లో ఎటువంటి నిజం లేదని వారు తెలిపారు. కావున పోస్ట్ లోచెప్పింది తప్పు. 

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ఇలాంటి మెసేజ్ వివిధ దేశాల్లో వైరల్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం పై ‘Snopes’ సంస్థ తో ‘Sölen’ (లుప్పో చాక్లెట్ ని తయారు చేసే టర్కీ కంపెనీ) కంపెనీ వారు మాట్లాడుతూ, పోస్టులో చెప్పిన దాంట్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. తయారు చేసే సమయంలో అలాంటివి ఏవీ కూడా కేక్ లో ఉండే అవకాశం లేదని, ఎవరో కావాలనే మాత్రలుగా కనిపించే వాటిని కేక్ లో పెట్టారని తెలిపారు.

అంతేకాదు, ‘Sölen’ కంపెనీ తాయారు చేసే చాక్లెట్ల నాణ్యత పై ఇచ్చిన సర్టిఫికేట్లను ‘Snopes’ వారి ఆర్టికల్ లో చూడవొచ్చు.  వీడియోలో చూపెట్టిన ‘Luppo Coconut Cream Bars’ ని టర్కీ లో తయారు చేసి, కేవలం ఇరాక్ దేశంలోనే అమ్ముతారు. కావున, భారత మార్కెట్ లో అవి లభించవు. ‘Luppo Coconut Cream Bars’ తయారు చేసే సమయంలో 700 మైక్రోన్స్ కి మించి పరిమాణం ఉన్నది ఏదీ కూడా ఆ చాక్లెట్ తయారీలో వాడారని ‘Sölen’ సంస్థ ప్రతినిధి తెలిపినట్టు ఆ ఆర్టికల్ లో చదవొచ్చు.

అంతేకాదు, ఎవరో కావాలనే ఆ కేక్ లో మాత్రలను పై నుండి పెట్టినట్టు మార్కింగ్లు ఉన్నాయని ‘teyit’ అనే టర్కిష్ సంస్థ ఆర్టికల్ లో చూడవొచ్చు. మరిన్ని వివరాలను ఆ ఆర్టికల్ లో చదవొచ్చు.

చివరగా, వీడియోలోని లుప్పో కేక్ భారత మార్కెట్ లో దొరకదు. ఆ కేక్ తిన్న పిల్లలకు పక్షవాతం రాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?