ఈ ఫోటో కేరళకి సంబంధించింది, పశ్చిమ బెంగాల్ ది కాదు

CPI పార్టీ ప్రచార వాహనం ఎదుట కేవలం ఒక్కరే కార్యకర్త కనిపిస్తున్న ఒక ఫోటోని షేర్ చేసి పశ్చిమ బెంగాల్ లో ఉదృతంగా సాగుతున్న కమ్యూనిస్టుల ప్రచారమని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లో ఉదృతంగా సాగుతున్న కమ్యూనిస్టుల ప్రచారం. CPI పార్టీ ప్రచార వాహనం ఎదుట కేవలం ఒక్కరే కార్యకర్త

ఫాక్ట్(నిజం):  పోస్టులో ఉన్న ఫొటోలోని జీప్ పై ఉన్న బ్యానర్ పైన వ్యాఖ్యలు మలయాళంలో రాసి ఉన్నాయి. దీన్నిబట్టి ఈ ఫోటోకి బెంగాల్ కి సంబంధంలేదని చెప్పొచ్చు. పైగా ఈ ఫోటో 2019 నుండి కేరళ నేపథ్యంలో షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 25 మార్చ్ 2020న షేర్ చేసిన ఒక ఫేస్ బుక్ పోస్ట్ మాకు కనిపించింది. దీన్నిబట్టి ఈ ఫోటో పాతదని, ఇప్పటిది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. 

ఇంకా 2019లో షేర్ చేసిన ఈ ఫొటోలో జీప్ పైన ఉన్న బ్యానర్ లో అక్షరాలు మలయాళంలో రాసి ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్నిబట్టి ఈ ఫోటో బెంగాల్ కి సంబంధించింది కాదని, కేరళకి సంబంధించిందని చెప్పొచ్చు. పైగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా లభించిన పోస్టులో కూడా ఈ ఫోటోని  “കനല്‍ ഒരിത്തിരി….” అన్న మలయాళం వ్యాఖ్యలతో షేర్ చేసాడు. ఇంకా ఫోటోపై మరికొన్ని మలయాళంలో ఉన్న వ్యాఖ్యలు చూడొచ్చు.

చివరగా, పోస్టులో ఉన్న ఫోటో పశ్చిమ బెంగాల్ కి సంబంధించింది కాదు.