తమ దేశ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడ్డానికి కెన్యా ప్రభుత్వం ‘మసాయ్’ తెగను రంగంలోకి దింపలేదు

‘కెన్యా లో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను పోలీసులు అమలు చేయలేకపోయారని, ప్రజలు వారిని పట్టించుకోలేదని, దాంతో అక్కడి ప్రభుత్వం మసాయ్ గిరిజన తెగ నాయకుడితో మాట్లాడి వారిని దింపిందని, అప్పుడు 24 గంటల్లో వీధుల్లో ఒక చీమ కూడా లేదు అని చెప్తూ ఫేస్బుక్ లో చాలా మంది ఒక వీడియో ని పోస్టు చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కెన్యా ప్రభుత్వం దేశ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడ్డానికి ‘మసాయ్’ తెగను ఉపయోగిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో వాస్తవ ఘటనకి సంబంధించినది కాదు. దానిని ‘ఎంటర్టైన్మెంట్’ ఆధారంగా వీడియో లను చిత్రీకరించే ‘Mbuzzi Seller’ అనే ఒక యూట్యుబ్ చానెల్ తీసింది. అంతేకాదు, కెన్యా ప్రభుత్వం దేశ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడ్డానికి ‘మసాయ్’ తెగను రంగంలోకి దింపినట్లుగా వార్తా కథనాలేమీ లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులోని వీడియో క్లిప్ పై ‘Mbuzzi Seller’ అని ఉంది. ఆ పదాలతో యూట్యుబ్ లో వెతికినప్పుడు, అదే పేరుతో ఉన్న ఒక యూట్యుబ్ చానెల్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ చానెల్ లో పోస్టులోని క్లిప్ యొక్క పూర్తి వీడియో లభించింది. దానిని పరిశీలించినప్పుడు, ఆ వీడియోని వినోదం కోసం తీసినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు, ఆ వీడియో యొక్క వివరణ లో ‘#Tanzania comedy’ అని కూడా ఉంది. ఆ యూట్యుబ్ చానెల్ లోని ఇతర వీడియోల్లో కూడా ఆ వ్యక్తి అదే దుస్తుల్లో ఉండడం చూడవచ్చు.  

కెన్యా ప్రభుత్వం దేశ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడ్డానికి ‘మసాయ్’ తెగను రంగం లోకి దింపిందా అని వెతికినప్పుడు, ఆ విషయాన్ని ద్రువికరిస్తూ న్యూస్ రిపోర్ట్స్ ఏమీ లభించలేదు. వీడియో క్లిప్ వైరల్ అవడంతో ‘kenyans.co.ke’ అనే న్యూస్ వెబ్సైట్ దానిని విశ్లేషిస్తూ రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, తమ దేశ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించేలా చూడ్డానికి కెన్యా ప్రభుత్వం ‘మసాయ్’ తెగను రంగంలోకి దింపలేదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?