‘తెలంగాణ పై ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది’ అని కేసీఆర్ అన్నట్లుగా ఉన్న TV9 బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది

‘తెలంగాణ పై ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది.. తెరాస 100% ముస్లింల కోసం పని చేస్తుంది, వాళ్ళ ఓట్లే కీలకం’ అని కేసీఆర్ అన్నట్లుగా ఉన్న TV9 బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ యొక్క ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘తెలంగాణ పై ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది’ అని కేసీఆర్ అన్నట్లుగా ఉన్న TV9 బ్రేకింగ్ న్యూస్.

ఫాక్ట్ (నిజం): కేసీఆర్ పోస్టులో చెప్పిన వ్యాఖ్యలు చేయలేదు. ఆయన అలా అన్నట్లుగా ఉన్న TV9 బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

పోస్టులోని ఫోటోకు సంబంధించిన వీడియో కోసం TV9 యొక్క యూట్యూబ్ ఛానెల్ లో ‘KCR press meet’ అని వెతికినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో, ఫొటోలోని వ్యక్తులతో కూడిన వీడియో ‘KCR Press Meet : Sensational Move To Change National Politics – War with BJP & Congress’ అనే టైటిల్ తో లభించింది. ఆ వీడియో ని పూర్తిగా చూసినప్పుడు, అందులో ఎక్కడా కూడా కేసీఆర్ పోస్టులోని ఫోటో లో ఉన్న వ్యాఖ్యలు చేయలేదని తెలుస్తుంది. ఫోటోలో ఉన్న పరిసరాలను ఆ వీడియోలో 26:52 నిడివి దగ్గర వేరే వార్తతో చూడవచ్చు. కావున, పోస్టులోని ఫోటో లో ఆ వ్యాఖ్యాలతో ఉన్న TV9 బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది.

చివరగా, ‘తెలంగాణ పై ముస్లింలకు ప్రథమ హక్కు ఉంటుంది’ అని కేసీఆర్ అన్నట్లుగా ఉన్న TV9 బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్ ఫోటోషాప్ చేసినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?