కర్ణాటక లోని జోగ్ జలపాతం వీడియో పెట్టి మంగంపేట జలపాతం అని ప్రచారం చేస్తున్నారు

ఒక జలపాతం వీడియో పెట్టి అది కర్నూల్ జిల్లా లోని మంగంపేట జలపాతం కి సంబంధించిన వీడియో అని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కర్నూల్ జిల్లాలోని మంగంపేట జలపాతం కి సంబంధించిన వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్నది కర్ణాటక రాష్ట్రంలోని జోగ్ జలపాతం; మంగంపేట జలపాతం కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ వీడియో జోగ్ జలపాతం కి సంబంధించిన వీడియో అని సెర్చ్ రిజల్ట్స్ లో చాలా వీడియోలు వస్తాయి.

యూట్యూబ్ లో ‘Jog Falls’ అని వెతకగా, అలాంటి వీడియోనే ‘Loksatta Live’ ఛానల్ వారు కూడా జోగ్ ఫాల్స్ అని పోస్ట్ చేసినట్టుగా చూడవొచ్చు.

మంగంపేట జలపాతం గురించి గూగుల్ లో వెతకగా, వీడియోలో ఉన్న దానికీ గూగుల్ మాప్స్ లో వచ్చిన మంగంపేట ఫోటోలకి తేడా ఉన్నట్టు చూడవొచ్చు.

చివరగా, కర్ణాటక లోని జోగ్ జలపాతం వీడియో పెట్టి మంగంపేట జలపాతం అని ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?