Fake News, Telugu
 

జే.ఎన్.యూ (JNU) స్టూడెంట్ సూరి కృష్ణన్ కి నిజంగానే దెబ్బలు తగిలాయి. తను నటించలేదు

0

తనకు దెబ్బలు తగిలినట్టుగా జే.ఎన్.యూ (JNU) స్టూడెంట్ సూరి కృష్ణన్ నటించాడని, నిజంగా దెబ్బలు తగిలితే 24 గంటలు గడవక ముందే తన వొంటి మీద ఉన్న కట్లు ఎలా మాయం అవుతాయని కొందరు ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దెబ్బలు తగిలినట్టుగా నటించిన జే.ఎన్.యూ స్టూడెంట్ సూరి కృష్ణన్. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కట్లు మాయం.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటోలు నిజమే, కానీ సూరి దెబ్బలు తగిలినట్టుగా నటించాడు అన్నదాంట్లో నిజం లేదు. తన తల మీద దెబ్బలకు వేసిన కుట్లను చూపిస్తూ సూరి పెట్టిన వీడియోలో తనకు నిజంగానే దెబ్బలు తాకినట్టు చూడవొచ్చు. కావున, పోస్టులో తనుకు దెబ్బలు తగిలినట్టుగా నటించాడని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

సోమవారం రోజు త్రివేండ్రం విమానాశ్రయంలో దిగిన సూరికి వివిధ సంఘాల నాయకులు స్వాగతం పలికినట్టు ‘న్యూస్18’ ఆర్టికల్ లో చదవొచ్చు. విమానాశ్రయం లో తీసిన ఫోటోలలో మరియు వీడియోలో సూరి తలకు మరియు చేతులకు కట్లు లేనట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో పెట్టిన ఫోటో నిజమే.

అయితే, తన తల మీద దెబ్బలకు వేసిన కుట్లను చూపిస్తూ సూరి చేసిన వీడియోని అందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నట్టు చూడవొచ్చు. ఆ వీడియోలో సూరికి నిజంగానే దెబ్బలు తగిలినట్టు చూడవొచ్చు. కుట్ల మీద బ్యాండేజ్ అవసరం లేదని డాక్టర్లు చెప్పడంతో తను తన తలకు ఉన్న బ్యాండేజ్ తీసేసినట్టు వీడియోలో సూరి చెప్తాడు. అంతేకాదు, తన చేతికి కూడా గాయాలు అయ్యాయని ఆ వీడియోలో సూరి చెప్తాడు.

ఇండియా టుడే ఆర్టికల్ లో సూరికి తగిన దెబ్బల గురించి మెడికల్ రిపోర్ట్ కూడా చూడవొచ్చు.

అంతేకాదు, కేరళ విమానశ్రయంలో కంటే ముందే, ఢిల్లీ లో హాస్పిటల్ దగ్గరే తన కట్లను సూరి తీసేసినట్టుగా ‘Newslaundry’ వెబ్ సైట్ లో ఫోటో చూడవొచ్చు.

చివరగా, జే.ఎన్.యూ స్టూడెంట్ సూరి కృష్ణన్ కి నిజంగానే దెబ్బలు తాకాయి. తను నటించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll