‘దేశంలోనే అప్పులేని రాష్ట్రంగా ఢిల్లీ’ అనేది తప్పు; ఢిల్లీ రాష్ట్రానికి కూడా అప్పు ఉంది

దేశంలోనే అప్పులేని రాష్ట్రంగా ఢిల్లీ; సమర్ధుడైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్’, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: దేశంలోనే అప్పులేని రాష్ట్రంగా ఢిల్లీ.

ఫాక్ట్: ఢిల్లీ రాష్ట్రానికి కూడా అప్పు ఉంది. 2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఢిల్లీకి మార్చి 2020 నాటికి సుమారు 31 వేల కోట్ల అప్పు ఉందని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. అంతే కాదు, 2021-22 ఏడాదికి సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని కూడా చెప్పారు. ఆర్‌బీఐ వారి ‘State Finance 2020-21’ ప్రకారం, ‘Debt as percent of GSDP’ (GSDPలో అప్పు శాతం) డేటా చూస్తే, మిగితా రాష్ట్రలతో పోలిస్తే ఢిల్లీ అప్పు తక్కువ అని కూడా తను తెలిపాడు. కాబట్టి, అసలు ఢిల్లీ రాష్ట్రానికి అప్పు లేదని చెప్పడంలో నిజంలేదు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవడానికి 2021-22 ఢిల్లీ బడ్జెట్ ప్రసంగం చూడగా, తమకు మార్చి 2020 నాటికి సుమారు 31 వేల కోట్ల అప్పు ఉందని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆ స్పీచ్‌లో తెలిపినట్టు తెలిసింది. అంతేకాదు, ఆర్‌బీఐ వారి ‘State Finance 2020-21’ ప్రకారం, ‘Debt as percent of GSDP’ (GSDPలో అప్పు శాతం) డేటా చూస్తే, మిగితా రాష్ట్రలతో పోలిస్తే ఢిల్లీ అప్పు తక్కువ అని కూడా తను తెలిపారు. 2021-22 ఢిల్లీ బడ్జెట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అంతే కాదు, 2021-22 ఏడాదికి సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని కూడా చెప్పారు.

ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లోని ‘State Finance 2020-21’ డేటాలో ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఉన్న అప్పు వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, అసలు ఢిల్లీ రాష్ట్రానికి అప్పు లేదని చెప్పడంలో నిజం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి మార్చి 2020 నాటికి సుమారు 31 వేల కోట్ల అప్పు ఉందని ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. అంతే కాదు, 2021-22 ఏడాదికి సుమారు 9,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని కూడా చెప్పారు.