Fake News, Telugu
 

ఆన్‌లైన్‌లో ఇటువంటి పాత నాణేలు, నోట్లకు సంబంధించి లావాదేవీలు చేసినప్పుడు జాగ్రత్త వహించడం మంచిది

0

2002లో ఆర్‌బీఐ జారీ చేసిన వైష్ణోదేవి ఫోటో కలిగి ఉన్న రూ.5 లేదా రూ.10 నాణేలు గనక ఒకరి దెగ్గర ఉంటే వారికి 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. పాత నాణేలు, నోట్లకు సంబంధించి జరుగుతున్న అమ్మకాలు, కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని పోస్ట్ ద్వారా అంటున్నారు. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా బాగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2002లో ఆర్‌బీఐ జారీ చేసిన వైష్ణోదేవి ఫోటో కలిగి ఉన్న రూ.5 లేదా రూ.10 నాణేలు గనక ఒకరి దగ్గర ఉంటే వారికి 10 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫాక్ట్: పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. కొందరు ఈ పాత నాణేలను దేశం నలుమూలల నుండి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. ఇండియామార్ట్, క్వికర్, ఎర్న్ మనీ, కాయిన్ బజార్, OLX వంటి ఈ-కామర్స్ సైట్లలో పాత నాణేలు మరియు నోట్లకు సంబంధించి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి. అమ్మకం, కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు. ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు, మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు. అందుకని ఇటువంటి లావాదేవీలు చేసినప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్‌లో పాత నాణేలు మరియు నోట్లకు సంబంధించి జరుగుతున్న అమ్మకాలు మరియు కొనుగోలు గురించి హెచ్చరిస్తూ ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసింది. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది.

పోస్టులో చెప్పిన విషయం గురించి గూగుల్లో వెతకగా, అదే విషయం గురించి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ (ఇక్కడ మరియు క్కడ) లభించాయి. పాత నాణేలు మరియు నోట్లను అనేక వెబ్సైటులలో వేలం వేస్తున్నారని జీ న్యూస్ ఆర్టికల్‌లో తెలిపారు. 2002లో ఆర్‌బీఐ జారీ చేసిన వైష్ణోదేవి ఫోటో కలిగి ఉన్న రూ.5 లేదా రూ.10 నాణేలు 10 లక్షలు దాకా ఆన్‌లైన్‌లో పలుకుతుందని ఆర్టికల్‌ ద్వారా తెలుస్తుంది. కానీ, ఆర్టికల్ చివర్లో, ఆన్‌లైన్‌లో పాత నాణేలు మరియు నోట్లకు సంబంధించి జరుగుతున్న అమ్మకాలు మరియు కొనుగోలు గురించి ఆర్‌బీఐ హెచ్చరించిందని తెలిపారు.

04 ఆగష్టు 2021న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్‌లో పాత నాణేలు మరియు నోట్లకు సంబంధించి జరుగుతున్న అమ్మకాలు మరియు కొనుగోలు గురించి హెచ్చరిస్తూ ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పేరు/లోగోను వాడుకొని కొంతమంది పాత నాణేలు మరియు నోట్లను విక్రయించి మోసం చేస్తున్నారని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును ఉపయోగించి ఛార్జీలు/ కమిషన్/ పన్నులు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి విషయాల్లో కమిషన్ తీసుకోవడం లాంటివి చేయదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పాత నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం కొంతమందికి హాబీ. మరికొందరు జ్ఞాపకాల కోసం దాచుకుంటారు. కొందరు ఈ పాత నాణేలను దేశం నలుమూలల నుంచి సేకరిస్తారు. దీనికి ఎంత ఖర్చైనా కూడా వెనుకాడరు. వీటితో అప్పుడప్పుడు ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటారు. ఇది భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా జరుగుతుంది.

ఇండియామార్ట్, క్వికర్, ఎర్న్ మనీ, కాయిన్ బజార్, OLX వంటి ఈ-కామర్స్ సైట్లలో పాత నాణేలు మరియు నోట్లకు సంబంధించి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ వ్యాపారానికి వేదికగా నిలుస్తున్న ఈ-కామర్స్ వెబ్‌సైట్లు కేవలం థర్డ్ పార్టీగానే వ్యవహరిస్తాయి. అమ్మకం, కొనుగోలు అంశాలతో వాటికి సంబంధం ఉండదు. ఈ వ్యాపారంలో జరిగే లావాదేవీలకు, మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు. అందుకని ఇటువంటి లావాదేవీలు చేసినప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.

చివరగా, ఆన్‌లైన్‌లో ఇటువంటి పాత నాణేలు మరియు నోట్లకు సంబంధించి లావాదేవీలు చేసినప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.

Share.

About Author

Comments are closed.

scroll