హనుమాన్ స్టిక్కర్‌ ఉన్న అంబులెన్స్ నిరాకరించడంతో కేరళలోని క్రైస్తవ దంపతులు కన్నుమూసినట్లు ‘Inshorts’ రిపోర్ట్ చేయలేదు

కేరళలో అంబులన్స్ వాహనం పై హనుమాన్ స్టిక్కర్ అతికించి ఉందని ఇద్దరు క్రిస్టియన్ దంపతులు ఎక్కకపోవడంతో వారు మరణించినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ‘Inshorts’ మీడియా ఔట్లెట్ ఈ విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ న్యూస్ అప్డేట్ పబ్లిష్ చేసిందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేరళలో  హనుమాన్ స్టిక్కర్ అతికించి ఉన్న అంబులన్స్ ఎక్కకపోవడంతో ఇద్దరు క్రిస్టియన్ దంపతులు మరణించారని  ‘Inshorts’ మీడియా ఔట్లెట్ రిపోర్ట్ చేసింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. పోస్టులో షేర్ చేసిన అంబులన్స్ ఫోటో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. కేరళలో హనుమాన్ స్టిక్కర్ అతికించి ఉన్న అంబులన్స్ ఎక్కనందుకు ఇద్దరు క్రిస్టియన్ దంపతులు మరణించారని  ‘Inshorts’ మీడియా ఔట్లెట్ ఎటువంటి న్యూస్ పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే దృశ్యం కలిగిన ఫోటోని షేర్ చేస్తూ ‘The Hindustan Times’ న్యూస్ సంస్థ ’10 మే 2021′ నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. బెంగళూరు నగర శివార్లలో కరోనా భాదితుల కోసం నిర్మించిన స్మశానంలో, కరోనా వలన చనిపోయిన వ్యక్తుల మృతదేహాలని వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు దహనానికి తీసుకెళ్తున్న దృశ్యాలని ఈ ఫోటో వివరంలో తెలిపారు. ఈ ఫోటోని ఇదే వివరణతో ‘Getty Images’ వెబ్సైటులో పబ్లిష్ చేసారు.

ఫోటోలో కనిపిస్తున్న అంబులన్స్ వాహనం పై బెంగళూరు నగరానికి సంబంధించిన  ‘Prasanna Ambulance Service’ పేరు ఉండటాన్ని బట్టి, ఈ ఫోటో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

పోస్టులో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ని ‘Inshorts’ అప్లికేషన్ లోని న్యూస్ ఇమేజ్ తో పోల్చి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినదని స్పష్టంగా తెలిసింది. పోస్టులో షేర్ చేసిన స్క్రీన్ షాట్లో కనిపిస్తున్న పదాల ఫాంట్, ‘Inshorts’ న్యూస్ పోర్టల్ ఉపయోగించే ఫాంట్ వేర్వేరు అని తెలుస్తుంది. అలాగే, స్క్రీన్ షాట్లోని అక్షరాలు సరైన ఆర్డర్లో లేకపోవడాన్ని మనం గమనించవచ్చు.

ఈ విషయం పై స్పష్టత కోసం ‘The Quint’ న్యూస్ సంస్థ  ‘Inshorts’  యాజమాన్యాన్ని సంప్రదించగా, కేరళలో  హనుమాన్ స్టిక్కర్ అతికించి ఉన్న అంబులన్స్ ఎక్కకపోవడంతో ఇద్దరు క్రిస్టియన్ దంపతులు మరణించారని తాము ఎటువంటి న్యూస్ పబ్లిష్ చేయలేదని ‘Inshorts’ యాజమాన్యం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ‘The Quint’ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా,  కేరళలో హనుమాన్ స్టిక్కర్ అతికించి ఉన్న అంబులన్స్ ఎక్కనందుకు ఇద్దరు క్రిస్టియన్ దంపతులు మరణించారని ‘Inshorts’ మీడియా సంస్థ రిపోర్ట్ చేయలేదు.