‘COVID-19 చికిత్స కోసం రాజస్తాన్ లో ఎనిమిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించిన భారత సైన్యం’ అనేది తప్పు వార్త

ఫేస్బుక్ లో కొన్ని ఫోటోలు పెట్టి, COVID-19 చికిత్స కోసం భారత సైన్యం ఎనిమిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని రాజస్తాన్ లో నిర్మించింది అని చెప్తున్నారు. కొందరు ఇదే వార్తను చెప్తూ యూట్యూబ్ వీడియోలు కూడా తీసారు. పోస్టులో ఆ ఫోటోల గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: COVID-19 చికిత్స కోసం భారత సైన్యం ఎనిమిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని రాజస్తాన్ లో నిర్మించింది.

ఫాక్ట్ (నిజం): COVID-19 చికిత్స కోసం భారత సైన్యం వెయ్యి పడకల ఆసుపత్రిని బార్మేర్ (రాజస్తాన్) లో నిర్మించిందంటూ వస్తున్నవి తప్పుడు వార్తలని భారత సైన్యం తెలిపింది. అంతేకాదు, పోస్టులోని ఫోటోలు పాతవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఇమేజ్-1:

ఫోటో ‘Anews’ అనే వార్తా సంస్థ ‘Russia to donate mobile hospital worth KGS 5.5 mln to Kyrgyz Emergency Ministry’ అనే వార్తతో 2019 లో ప్రచురించిన కథనం లో లభించింది.  

ఇమేజ్-2:

ఫోటో యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్సైటు లో 16 నవంబర్ 2008 న, ‘State sets up a mobile field hospital at March’ అనే టైటిల్ తో ఉన్న కథనం లో లభించింది.

ఇమేజ్-3:

ఫోటో మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ యొక్క ప్రిన్సిపల్ స్పోక్స్ పర్సన్ ట్విట్టర్ అకౌంట్ లో ఏప్రిల్ 2015 లో పెట్టిన ట్వీట్ లో లభించింది. ఫోటో ఖాట్మండు ఎయిర్ బేస్ వద్ద ఆర్మీ మెడికల్ కార్ప్స్ ‘నేపాల్ ఎర్త్ క్వేక్ క్యాజువాలిటీ ట్రైజ్ సెంటర్’ ని నెలకొల్పినప్పడిది అని అందులో ఉంది.

అంతే కాదు,భారత సైన్యం కూడా ఒక ట్వీట్ లో COVID-19 చికిత్స కోసం ఆర్మీ వెయ్యి పడకల ఆసుపత్రిని బామర్ (రాజస్తాన్) లో నిర్మించిందంటూ వస్తున్నవి తప్పుడు వార్తలని తెలిపింది.

చివరిగా, పాత ఫోటోలు పెట్టి, ‘COVID-19 చికిత్స కోసం రాజస్తాన్ లో ఎనిమిది రోజుల్లో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించిన భారత సైన్యం’ అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?