ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఎనిమిదోసారి ఎన్నికయ్యింది

ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (UNSC) ఎన్నికల్లో శాశ్వత సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది అని క్లెయిమ్ చేస్తున్న ఒక  పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టులో ఉన్న సమాచారం కోసం వెతకగా, భారత్ ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైనట్లు తెలిసింది. ఈ ఎన్నికతో భారత్ ఎనిమిదో సారి ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎంపికయ్యింది. భారత్ రెండు సంవత్సరాలు (2021 మరియు 2022) ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో కొనసాగనుంది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలో మొత్తం పదిహేను దేశాలు ఉంటాయి; వాటిలో ఐదు శాశ్వత సభ్యులు మరియు పది తాత్కాలిక సభ్యులు (రెండేళ్ళ సభ్యత్వం). ఆసియా-పసిఫిక్ వర్గానికి  చెందిన దేశంగా ఐరాస అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, భద్రత మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ స్థానం సంపాదించుకొంది. UNSC లో స్థానం కోసం 2/3 మెజారిటీతో గెలవాల్సి ఉండగా, పోల్ అయిన 192 ఓట్లలో 184 ఓట్లు భారత్ కు లభించాయని చెప్తూ ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి అయిన టి. ఎస్. తిరుముర్తి హర్షం వ్యక్తం చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘India at UN, NY’ ట్వీట్ : https://twitter.com/IndiaUNNewYork/status/1273346981650456576
2. ‘ANI’ ట్వీట్: https://twitter.com/ANI/status/1273352060885299202

Did you watch our new video?