Fake News, Telugu
 

పాలస్తీనా-ఇజ్రాయిల్ ఘర్షణల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయిల్‌కు బహిరంగంగా భారత్ మద్దతు పలకలేదు

0

ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్‌కు బహిరంగంగా మద్దతు పలికిన భారత్ అని, జాతీయవాదులు ఏదైతే కోరుకున్నారో అదే జరుగుతుంది అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాలస్తీనా-ఇజ్రాయిల్ ఘర్షణల నేపథ్యంలో ఐఖ్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్‌కు బహిరంగంగా మద్దతు పలికిన భారత్ దేశం.

ఫాక్ట్: ‘ఇండియా ఎట్ యుఎన్’, ఎన్ వై (India at UN, NY) ట్విట్టర్ హాండిల్ ద్వారా ఐక్యరాజ్యసమితిలో భారత దేశం ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించి చేసిన వ్యాక్యల్లో భారత దేశం ఇజ్రాయిల్ కు బహిరంగంగా మద్దతు తెలిపినట్టు లేదు. ‘టూ స్టేట్’ సొల్యూషన్ కు భారత్ కట్టుబడి ఉందని అందులొ తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

ఐఖ్యరాజ్యసమితిలో ఈ మధ్య భారత దేశం ఇజ్రాయిల్ కు మద్దతు ఇవ్వడానికి సంబంధించి ఏమైనా న్యూస్ ఆర్టికల్స్ గురించి వెతికినప్పుడు అటువంటి వార్తలు మాకు ఏమి దొరకలేదు. ఇండియా ఎట్ యుఎన్, ఎన్ వై (India at UN, NY) ట్విట్టర్ హాండిల్ ద్వారా ఐక్యరాజ్యసమితిలో భారత దేశం ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించి చేసిన వ్యాక్యలు ఈ పోస్ట్ ద్వారా చూడొచ్చు. ఇందులో భారత దేశం ఇజ్రాయిల్ కు బహిరంగంగా మద్దతు తెలిపినట్టు లేదు.

ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించి ఇటీవల జరిగిన హింసపై భారతదేశం అధికారిక అభిప్రాయం విషయానికి వస్తే, ఇది తటస్థంగానే ఉంది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టి.ఎస్. తిరుమూర్తి  మంగళవారం యుఎన్ ఎస్ సి (UNSC) సమావేశంలో మాట్లాడుతూ, “హరామ్ అల్ షరీఫ్/టెంపుల్ మౌంట్ లో ఘర్షణలు మరియు హింసపై భారతదేశం తీవ్రంగా ఆందోళన చెందుతోందని” మరియు “షేక్ జర్రా మరియు సిల్వాన్ పరిసర ప్రాంతాల్లో తొలగింపుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతోందని” ట్వీట్ చేశారు.  తాము ‘యథాతథ స్థితి’ కి మద్దతిస్తామని ఆయన చెప్పారు. జెరూసలేంలో అల్ జవియా అల్ హిందీయా అనే భారతీయ హాస్పీస్ కూడా ఉందని తెలిపారు. గాజా నుండి రాకెట్ కాల్పులను ఆయన ఖండించారు మరియు యుఎన్ఎస్సి తీర్మానం 2334 కు (పాలస్తీనా భూభాగాలలో ఇజ్రాయిల్ యొక్క సెటిల్మెంట్ అంతర్జాతీయ చట్టాల “స్పష్టమైన ఉల్లంఘన” అని పేర్కొంది) కట్టుబడి ఉండాలని కోరారు. ‘టూ స్టేట్’ (రెండు దేశాల) సొల్యూషన్ కు భారత్ కట్టుబడి ఉందని తిరుమూర్తి తెలిపారు. దీనికి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతన్యాహు తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా, వారికి మద్దతు ఇచ్చిన దేశాలకు కృతజ్ఞతలు చెబుతూ పెట్టిన పోస్టులో భారత దేశం ప్రస్తావన కూడా లేదు. ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించి ఇజ్రాయిల్ కు ఇతర దేశాల మద్దతుపై చేసిన వ్యాక్యలు ఇవి.

చివరగా, పాలస్తీనా-ఇజ్రాయిల్ ఘర్షణల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ కు బహిరంగంగా భారత్ మద్దతు పలకలేదు.

Share.

About Author

Comments are closed.

scroll