నారా చంద్రబాబు నాయుడుని కూర్చోపెట్టి మాట్లాడిన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మాత్రం నిల్చోపెట్టి మాట్లాడినట్టు చూపుతూ, రెండు వేరు వేరు వీడియో క్లిప్పులతో చేసిన ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నారా చంద్రబాబు నాయుడుని కూర్చోపెట్టి మాట్లాడిన ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మాత్రం నిల్చోపెట్టి మాట్లాడినట్టు వీడియోలో చూడవచ్చు.
ఫాక్ట్: చంద్రబాబుతో శరద్ పవార్ మాట్లాడుతున్న వీడియో 2019లో తీసినది; జగన్‌తో మాట్లాడుతున్న వీడియో 2016లో తీసినది. జగన్ మరియు పవార్ యొక్క 2016 మీటింగ్‌కి సంబంధించిన వేరే దృశ్యాల్లో జగన్‌ని కూడా పవార్ కూర్చోపెట్టి మాట్లాడినట్టు చూడవచ్చు. కావున, పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లోని వీడియోలో ఉన్న రెండు వీడియో క్లిప్పుల గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, చంద్రబాబుతో శరద్ పవార్ మాట్లాడుతున్న వీడియో 2019లో తీస్తే; జగన్‌తో మాట్లాడుతున్న వీడియో 2016లో తీసినట్టు తెలిసింది. ఆ మీటింగులకి సంబంధించిన మరిన్ని దృశ్యాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
జగన్ మరియు పవార్ యొక్క 2016 మీటింగ్‌కి సంబంధించిన వేరే దృశ్యాల్లో జగన్‌ని కూడా పవార్ కూర్చోపెట్టి మాట్లాడినట్టు చూడవచ్చు. ఆ మీటింగ్‌కి సంబంధించి వైసీపీ ట్వీట్ చేసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు. 2013లో జరిగిన ఒక మీటింగ్ ఫోటోల్లో కూడా జగన్‌ని పవార్ కూర్చోపెట్టి మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, పోస్ట్‌లోని వీడియోలో ఉన్న రెండు వీడియో క్లిప్పులు వివిధ సమయాల్లో జరిగిన రెండు వేరు వేరు మీటింగ్‌లకు సంబంధించినవి. ఆ మీటింగులలో చంద్రబాబు నాయుడు మరియు జగన్‌మోహన్ రెడ్డి ఇద్దరినీ శరద్ పవార్ కూర్చోపెట్టి మాట్లాడారు.