2019 కుంభ మేళ లో బస్సుల పెరేడ్ కి సంబంధించిన ఫోటోను వలస కూలీల కోసం ప్రియాంక గాంధీ ఏర్పాటు చేసిన బస్సులు అని షేర్ చేస్తున్నారు

బస్సులు వరుసగా ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసి లాక్ డౌన్ లో తమ స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కూలీలను తీసుకువెళ్లడానికి ప్రియాంక గాంధీ ఏర్పాటు చేసిన బస్సులు అని చెబుతున్నారు. కానీ, FACTLY విశ్లేషణలో ఆ ఫోటో 2019లో జరిగిన కుంభ మేళ సందర్భంగా జరిగిన బస్ పెరేడ్ కి  సంబంధించింది అని తెలిసింది. ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (UPSRTC) వారు మార్చ్ 2019 లో కుంభ మేళ కి ఏర్పాటు చేసిన 500 స్పెషల్ బస్సులతో  ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) లో ఆ పెరేడ్ నిర్వహించారు. బస్సులతో జరిగిన అతి పెద్ద పెరేడ్ అనే గిన్నిస్ వరల్డ్  రికార్డు కోసం ఆ పెరేడ్ ని నిర్వహించారు. అంతకుముందు, ప్రియాంక గాంధీ లాక్ డౌన్ వలన తమ స్వస్థలాలకు నడిచి వెళుతున్న వలస కార్మికుల కోసం1000 బస్సులను నడపడానికి అనుమతి కోరుతూ UP ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు, దానికి  UP ప్రభుత్వం అంగీకరించి దానికి అవసరమైన వివరాలను పంపమని కోరింది.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘ANI’ ట్వీట్ –  https://twitter.com/ANINewsUP/status/1100976395646308353
2. న్యూస్ ఆర్టికల్ –  https://www.businessinsider.in/in-pics-this-indian-state-is-trying-to-set-a-world-record-by-parading-a-line-up-of-500-buses/articleshow/68199100.cms

Did you watch our new video?