ఎడిట్ చేసిన వీడియో ని పెట్టి ప్రజలు ప్రధాని మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ హేళన చేస్తున్నారు అని షేర్ చేస్తున్నారు

‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాలతో  ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని  హేళన చేస్తున్నారు, అంటూ సోషల్ మీడియాలో ఒక  వీడియో వైరల్ అవుతుంది. FACTLY విశ్లేషణలో ఆ  వీడియో యొక్క ఆడియో ఎడిట్ చేసినట్టు తెలిసింది. ప్రధాన మంత్రి అంపన్ తుఫాను వల్ల నష్టబోయిన జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు వెస్ట్ బెంగాల్ లో చిత్రీకరించిన వీడియో అది. ఆ ఓరిజినల్ వీడియో ని ‘Akashvani Sangbad Kolkata’ తమ ఫేస్బుక్  అకౌంట్లో పోస్ట్ చేసారు. ఆ వీడియో లో కొందరు వ్యక్తులు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తుండటం మనం వినవొచ్చు. ఆ ఆడియో ట్రాక్ ని ఎడిట్ చేసి ‘చౌకీదార్ చోర్ హై’ అనే  నినాదాలతో ఉన్న మరొక  వీడియో యొక్క ఆడియో ట్రాక్ ని జత చేసారు. ‘చౌకీదార్ చోర్ హై’  ఆడియో ట్రాక్ తో ఉన్న  వీడియో కర్ణాటక బీజేపీ ఎలెక్షన్ ర్యాలీలో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అరవడానికి సంబందించింది. కావున, ఈ వీడియోలో నరేంద్ర మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ఎవరూ హేళన చేయలేదు. 

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/akasvanisangbadkolkata/posts/1192060754480865
2. యూట్యూబ్ వీడియో – https://www.youtube.com/watch?v=0bnljP8W2cU

Did you watch our new video?