ఫోటోలో ఉన్నది ‘40 ఏళ్ళ JNU బీ.ఏ. విద్యార్థి’ కాదు. తను 2018 లోనే పీ.హెచ్.డీ పూర్తి చేసాడు

ఫీజు పెంచినందుకు నిరసనగా గత కొద్ది రోజుల నుండి జవహర్లాల్ నెహ్రు యూనివర్సిటీ (JNU) విద్యార్థులు నిరసనలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ నిరసనల్లో ‘నకిలీ రక్తంతో’ 40 సంవత్సరాల బీ.ఏ. విద్యార్థి అని చెప్తూ ఒక వ్యక్తి ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 40 సంవత్సరాల జే.ఎన్.యూ బీ.ఏ. విద్యార్థి.    

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని వ్యక్తి పేరు సందీప్ కే లూయిస్. తన వయసు 33 సంవత్సరాలు. 2018 లోనే జే.ఎన్.యూ లో పీ.హెచ్.డీ పూర్తి చేసాడు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలోని వ్యక్తీ పేరు ‘Sandip K Louis’ అని ‘edex Live’ వెబ్ సైట్ లోని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. తను 2018 లోనే జే.ఎన్.యూ లోని ‘School of Arts and Aesthetics’ నుండి పీ.హెచ్.డీ పూర్తి చేసాడు. తన పేరును జే.ఎన్.యూ లో పీ.హెచ్.డీ కోసం రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ లిస్టులో కూడా చూడవొచ్చు.

అంతేకాదు, తన వయసు 33 ఏళ్ళు అని ‘Hindustan Times’ ఆర్టికల్ లో చూడవొచ్చు. ‘Indian Express’ వారితో మాట్లాడుతూ, ‘పోలీసులు లాగడం వల్ల బాలన్స్ కోల్పోయి కింద పడ్డాను. తల నెలకు తగలడం వల్ల ఐదు కుట్లు పడ్డాయి’ అని సందీప్ తెలిపాడు. 

చివరగా, ఫోటోలో ఉన్నది ‘40 ఏళ్ళ జే.ఎన్.యూ బీ.ఏ. విద్యార్థి’ కాదు. తను 2018 లోనే పీ.హెచ్.డీ పూర్తి చేసాడు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?