కొంతమంది వ్యక్తులు ఒక మహిళని కొడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి ‘మధ్యప్రదేశ్లో ఒక క్రైస్తవ చర్చిలో ప్రార్థన సమావేశానికి హాజరైన సమయంలో హిందూ బాలిక సజీవ దహనం చేయబడింది’ అనే ఆరోపణతో షేర్ చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.
క్లెయిమ్: మధ్యప్రదేశ్లోని ఒక చర్చిలో ప్రార్థన సమావేశానికి హాజరైన హిందూ బాలికని సజీవ దహనం చేయడానికి సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): ‘గ్వాటెమాలా’ దేశంలో టాక్సీ డ్రైవర్ను హత్య చేసిందనే ఆరోపణతో ఒక మహిళకి కొంతమంది వ్యక్తులు నిప్పంటించి చంపిన ఘటనకి సంబంధించిన వీడియో అది. కావున, పోస్టులో చెప్పింది అబద్ధం.
పోస్టులో ఉన్న వీడియోకి సంబంధించిన అనేక స్క్రీన్ షాట్స్ తీసి, వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ ఆ వీడియో ‘గ్వాటెమాలా’ దేశంలో జరిగిన సంఘటనకి సంబంధించినదని వచ్చాయి. దానితో, గూగుల్ లో ‘Guatemala girl set fire and killed’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు, వీడియోలో కనిపించే ఘటనకి సంబంధించిన అనేక ఫొటోలతో కూడిన ‘Daily Mail’ వారి కథనం సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. ఆ ఆర్టికల్ద్వారా, గ్వాటెమాలా దేశంలో ఒక మహిళ అక్కడి టాక్సీ డ్రైవర్ను హత్య చేసిందనే ఆరోపణతో కొంతమంది వ్యక్తులు ఆమెకు నిప్పంటించి చంపారు అని తెలుసింది.
అదే విషయాన్ని వెల్లడిస్తూ ‘Independent’ పత్రిక రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ‘గ్వాటెమాల’ దేశపు వీడియోని పెట్టి మధ్యప్రదేశ్ చర్చిలో ప్రార్థన సమావేశానికి హాజరైన హిందూ బాలిక సజీవ దహనం అని తప్పుడు ఆరోపణతో షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?