భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించిన అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించలేదు, కేవలం మరింత సమాచారం కోరింది.

తమ సంస్థ డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని భారత్ బయోటెక్ చేసిన ధరఖాస్తుని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని చేసిన అప్లికేషన్ ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

ఫాక్ట్(నిజం): భారత్ బయోటెక్ డెవలప్ చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం చేసుకున్న అప్లికేషన్ ప్రభుత్వ కమిటీ (SEC) తిరస్కరించలేదు, కేవలం ఈ సంస్థ వాక్సిన్ యొక్క ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన సామర్థ్యం మరియు భద్రత సమాచారం తమకు సమర్పించాలని కోరింది. ఇదే వార్తని ఒక జాతీయ మీడియా ప్రచురించినప్పుడు ఈ వార్త నిజం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇదే విషయం గురించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వేతకగా ఇదే వార్తని ఒక జాతీయ మీడియా ప్రచురించినప్పుడు ఈ వార్త నిజం కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. 

ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘Central Drugs Standard Control Organization’ వెబ్సైటు లో వెతకగా, అత్యవసర వినియోగానికి సంబంధించి భారత్ బయోటెక్ చేసిన ధరఖాస్తుని అధ్యయనం చేసిన ‘సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ’ (SEC) తదుపరి అనుమతుల కోసం ఈ సంస్థ తాయారు చేస్తున్న వాక్సిన్ యొక్క ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన సామర్థ్యం మరియు భద్రత సమాచారం తమకు సమర్పించాలని చెప్పిందే తప్ప భారత్ బయోటెక్ చేసిన ధరఖాస్తుని SEC తిరస్కరించలేదు. ఈ కమిటీ రెండు కంపెనీలనుండి మరింత సమాచారం కోరగా, Pfizer కంపెనీ మాత్రం కమిటీకి తమ ప్రెసెంటేషన్ సమర్పించేందుకు గడువు కోరింది. SEC సూచనల యొక్క డాక్యుమెంట్ ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న వాక్సిన్ అత్యవసర వినియోగానికి సంబంధించిన ధరఖాస్తుని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించలేదు, కేవలం మరింత సమాచారం కోరింది.