అమెరికాలో మరణ శిక్ష పడ్డ వ్యక్తి పాము కాటు అని ఊహించి సూది వల్ల చనిపోయాడు అని చెప్తున్న ఈ కథనం కల్పితం

YouTube Poster

అమెరికాలో మరణ శిక్ష పడ్డ ఒక వ్యక్తి పాము కాటుతో తనను చంపమని కోరుకున్నాడని, త్రాచు పామును అతని ముందుపెట్టి కళ్ళకు గంతలు కట్టి ఒక కొత్త సూదితో పాముకాటు వేసినట్టు అతన్ని గుచ్చారని, దానితో అతను చనిపోయాడు అని, పరీక్ష చేయగా అతని ఒంట్లో విషం దొరికిందని, ఒక పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూదాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: అమెరికాలో మరణ శిక్ష పడ్డ ఓ వ్యక్తి పాముకాటు అని ఊహించి సూది వల్ల చనిపోయాడు.

ఫాక్ట్: అమెరికాలో ఒక వ్యక్తికి గనక మరణశిక్ష పడితే, అతనిని ఉరి తీయటానికి వాడే పద్దతుల్లో పాముకాటు లేదు. ఇటువంటి సంఘటన ఒకటి జరిగినప్పుడు, అన్ని ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్ట్ చెయ్యాలి, అటువంటి సమాచారం కూడా ఎక్కడా లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

అమెరికాలో ఒక వ్యక్తికి గనక మరణశిక్ష పడితే, అతనిని ఉరి తీయటానికి వాడే పద్దతుల్లో పాముకాటు లేదు. ఆ పద్దతుల లిస్టు ఇక్కడ చూడొచ్చు.

అమెరికాలో ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది అని ఏ ప్రముఖ వార్తా సంస్థ రిపోర్ట్ చెయ్యలేదు. ఇంటర్నెట్ లో కూడా ఎక్కడా దీని గురించి ఎటువంటి ప్రామాణికమైన సమాచారం మాకు దొరకలేదు. ఇదే సంఘటన గురించి వెతికినప్పుడు, అదే కధతొ ఒక బ్లాగ్ సైటులో రష్యా దేశం పేరు తీసుకొని ఇదే కథ చెప్పటం జరిగింది. అదే బ్లాగ్ లో చివరన, ఈ కథ నిజమో కాదో తనకు కూడా తెలియదు అని అందులొ చెప్పారు. ఇలా దేశం పేరు మార్చి, అదే కథను రిపీట్ చేస్తున్నారు.

ఇదే క్లెయిమ్ గతంలో వైరల్ అయినప్పుడు ఇండియా టుడే ప్రచురించిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, అమెరికాలో మరణ శిక్ష పడ్డ వ్యక్తి పాము కాటు అని ఊహించి సూది వల్ల చనిపోయాడు అని చెప్తున్న ఈ కథనం కల్పితం.