1955లో 57 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుండి మయామికి బయల్దేరిన డిసి-4 ఛార్టర్డ్ ఫ్లైట్ 37 ఏళ్ళ పాటు మాయమై వెనుజ్వెలాలో 1992లో ల్యాండ్ అయ్యింది అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: 1955లో న్యూ యార్క్ నుండి బయలుదేరిన డిసి-4 ఛార్టర్డ్ ఫ్లైట్ 37 సంవత్సరాల తర్వాత 1992లో వెనుజ్వెలలోని కార్కస్ ఎయిర్పొర్టులో ల్యాండ్ అయ్యింది.
ఫాక్ట్ (నిజం): ఈ మొత్తం కథ ఒక కల్పిత గాధ. వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టాబ్లాయిడ్ ఈ కల్పిత కథనాన్ని మొట్టమొదటిసారిగా 1985లో ప్రచురించింది. 1979 నుండి 2007 వరకు ప్రచురణలో ఉన్న ఈ టాబ్లాయిడ్ కల్పిత వార్తలని ప్రచురించడంలో ప్రసిద్ధం. వీరు పాన్ ఆమ్ ఫ్లైట్ 914, డగ్లస్ డిసి -4 1955లో న్యూయార్క్ నుండి మియామికి బయల్దేరింది, అది 1985లో వెనుజ్వెలాలోని కార్కస్ ఎయిర్పొర్టులో ల్యాండ్ అయ్యింది అని వారు మొదట ప్రచురించిన కథనం. ఇదే కల్పిత కథనాన్ని వీక్లీ వరల్డ్ న్యూస్ వారు 1993లో మరియు 1999లో తిరిగి ప్రచురించారు. ఈ రెండు కథనాల్లో సాక్షి అని చెప్పి రాసిన జువాన్ డి లా కోర్టే వేరు వేరు ఫోటోలను ప్రచురించారు. అందుచేత పోస్టులూ చేతున్న క్లెయిమ్ తప్పు.
సరైన కీ వర్డ్స్ ఉపయోగించి డిసి-4 యొక్క రహస్యాన్ని గురించి ఏమైనా వార్త కథనాలు ప్రచురించారు అని వెతకగా, తగిన కథనాలు లభించలేదు. కానీ ప్లేన్ అండ్ పైలట్ మాగ్ వారి వెబ్సైటు లో ఒక కథనం లభించింది. దీన్ని బట్టి ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 914 డౌగ్లస్ డిసి-4’ అనే ఫ్లైట్ 1955లో న్యూయార్క్ లో బయలుదేరి 1985లో వెనుజ్వెలాలో ల్యాండ్ అయ్యింది అని చెప్తున్న ఈ కథనంలో ఎటువంటి నిజం లేదు, ఇది కేవలం ఒక కల్పిత కథ. దీన్ని వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టాబ్లాయిడ్ వారు మొదటగా 1985లో ప్రచురించారు. ఈ టాబ్లాయిడ్ నడిచినంతకాలం (1979 నుండి 2007) కట్టు కథలు ప్రచురించటంలో ప్రసిద్ధి (ఇక్కడ మరియు ఇక్కడ).
ఇదే కథనాన్ని వీక్లీ వరల్డ్ న్యూస్ వారు మరో రెండు సార్లు 1993లో మరియు 1999లో ప్రచురించారు. రెండు కథల్లో ప్రధాన సాక్షిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జువాన్ ‘డి లా కోర్టే’ పేరు రాసారు కానీ ఈ రెంటిలో ఫోటో వేర్వేరు మనుషులవి ప్రచురించారు. అంతే కాక అమెరికాలో జరిగిన ఎయిర్పోర్ట్ ఆక్సిడెంట్స్ కి సంభందించిన ఆర్కైవ్స్ లిస్టులో ఎక్కడా కూడా ‘పాన్ ఆమ్ ఫ్లైట్ 914 డౌగ్లస్ డిసి-4’ గురించి ఎటువంటి సమాచారం లేదు. ఇదే కథపై స్నోప్స్ వారు కూడా ఒక ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసారు. దాన్ని ఇక్కడ చదవచ్చు.
చివరిగా, డిసి-4 ఛార్టర్డ్ ఫ్లైట్ 1955లో న్యూయార్క్ నుండి బయల్దేరి 37 ఏళ్ళ పటు మాయమై 1992లో వెనుజ్వెలాలోని కార్కస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది అని చెప్తున్నది ఒక కల్పిత కథ.