Fake News, Telugu
 

ఈ ఫోటోల్లో ఉన్న పంజాబ్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ అత్యాచారానికి గురవలేదు; రోడ్డు ప్రమాదంలో మరణించింది.

0

పంజాబ్ రాష్ట్రంలో ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ ని అత్యాచారం చేసి, హత్య చేసారని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన ఫోటోల్లో ఒక ఐడీ ఫోటో కూడా ఉంది. దాంట్లో ఆ మహిళా పోలిస్ కానిస్టేబుల్ పేరు నోమి (తండ్రి పేరు సలీం మసిహ్) అని ఉంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):  పంజాబ్ లో అత్యాచారానికి గురై, హత్య చేయబడిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఫోటోల్లో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించింది. తను యాక్టివా మీద వెళ్తుండగా మహీంద్రా స్కార్పియో తన వాహనాన్ని ఢీ కొట్టింది. తను అక్కడే మరణించింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ నోమి గురించి ఇంటర్నెట్ లో వెతకగా, చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. మహిళా పోలీస్ కానిస్టేబుల్ నోమి పంజాబ్ లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు ఆ న్యూస్ ఆర్టికల్స్ లో చదవొచ్చు. తను యాక్టివా మీద వెళ్తుండగా మహీంద్రా స్కార్పియో తన వాహనాన్ని ఢీ కొట్టిందని, తను అక్కడే మరణించినట్టు కూడా తెలుస్తుంది. ఆ న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, ఆ ఘటన పై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్ లో కూడా అత్యాచారం ప్రస్తావనే లేనట్టు చూడవొచ్చు. కేవలం ఐపీసీ 304-ఏ మరియు 427 సెక్షన్లు మాత్రమే ఎఫ్.ఐ.ఆర్ లో ఉన్నాయి. పూర్తి ఎఫ్.ఐ.ఆర్ ని ఇక్కడ చదవొచ్చు. మహిళా పోలీస్ కానిస్టేబుల్ నోమి యాక్టివా, తనను ఢీ కొట్టిన మహీంద్రా స్కార్పియో (ఒకరు దాని ఫోటో కూడా పోస్ట్ చేసారు) వాహన నెంబర్లు ఎఫ్.ఐ.ఆర్ లో చూడవొచ్చు. ఆ వాహనాలకు సంబంధించిన మరింత సమాచారం కింద చూడవొచ్చు.

చివరగా, ఫోటోల్లో ఉన్న పంజాబ్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ నోమి ఒక రోడ్డు ప్రమాదంలో మరణించింది. తనని ఎవరూ అత్యాచారం చేసి హత్య చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll