పాత ఫోటో పెట్టి, లాక్ డౌన్ కారణంగా నడిచి నడిచి పగిలి పుళ్ళు పడిన వలస కూలీ పాదాల ఫోటో అని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఒక పాదాల ఫోటో పెట్టి, అది లాక్ డౌన్ కారణంగా నడిచి నడిచి పగిలి పుళ్ళు పడిన వలస కూలీ పాదాల ఫోటో అని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే, ఆ ఫోటోకీ, తాజా లాక్ డౌన్ కి సంబంధంలేదని FACTLY విశ్లేషణలో తేలింది. ఆ ఫోటో కనీసం అక్టోబర్ 2018 నుండి ఇంటర్నెట్ షేర్ చేయబడుతుంది. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవమే అయినా, ఫోటో ఇప్పటిది కాదు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. బ్లాగ్  – https://jiwanbaranupam.wordpress.com/2018/10/14/
2. పాత ట్వీట్ – https://twitter.com/Muoqbal/status/1057316750650470400

Did you watch our new video?