ఎడిట్ చేసిన వీడియోని చైనాలోని వాటర్ ఫౌంటెన్ భగవద్గీత సంగీతానికి అనుగుణంగా ప్రదర్శన చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

చైనాలోని ఒక వాటర్ ఫౌంటెన్ భగవద్గీత సంగీతానికి అనుగుణంగా అద్భుతంగా అమర్చిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

YouTube Poster
ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనాలోని వాటర్ ఫౌంటెన్ భగవద్గీత సంగీతానికి అనుగుణంగా అద్భుతంగా అమర్చిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. చైనాలోని లింగ్ షాన్ ఫౌంటెన్ దృశ్యాలని చూపుతున్న ఈ వీడియో యొక్క అసలు వెర్షన్లో భగవద్గీత మ్యూజిక్‌ లేదు. అసలు వీడియోలోని ఆడియోని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, వీడియోపై చైనీస్ భాషలో రాసి ఉన్న ఒక లోగో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చైనీస్ పదాలని అనువదించి చూస్తే అది ‘Tencent Video’ అని తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ఇంటర్నెట్లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియో ‘v.qq.com’ అనే చైనీస్ వెబ్సైటులో దొరికింది. చైనాలోని వుక్సి నగరంలో నిర్మించిన లింగ్ షాన్ మ్యూజికల్ ఫౌంటెన్లోని అతి పెద్ద బుద్దుని విగ్రహం యొక్క దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు. కాని, ఈ వీడియోలో భగవద్గీత సంగీతం ఎక్కడా లేదు. భగవద్గీత సంగీతం అనుసరించి ఈ వాటర్ ఫౌంటెన్ ప్రదర్శన అమర్చలేదు. ఈ అసలు వీడియోని ఒక యూట్యూబ్ యూసర్ 2016లో పోస్ట్ చేసారు.

లింగ్ షాన్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శనను చూపిస్తున్న మరికొన్ని వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలలో మ్యూజికల్ ఫౌంటెన్ ప్రదర్శన సమయంలో ఎప్పుడు భగవద్గీత సంగీతం ప్లే అవలేదు.

ఇదే వీడియోకి మరికొన్ని ఆడియో బిట్లను జోడిస్తూ చేసిన వేరే ఎడిటెడ్ వెర్షన్లని సోషల్ మీడియాలో షేర్ చేసారు. అసలు వీడియోలోని ఆడియోని ఎడిట్ చేసి ఈ వీడియోలని రూపొందించారు. పై వివరాల ఆదరంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని చైనాలోని వాటర్ ఫౌంటెన్ భగవద్గీత సంగీతానికి అనుగుణంగా ప్రదర్శన చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.