Fake News, Telugu
 

‘బండి సంజయ్ ఆస్తులపై బిజెపి అధిష్టానం ఆరా’, అని ఆంధ్రప్రభ ప్రచురించినట్టు ఉన్నది ఒక ఎడిటెడ్ ఫోటో

0

బండి సంజయ్ ఆస్తులపై బిజెపి అధిష్టానం ఆరా. తాజాగా గ్రానైట్ స్కాం ఆరోపణలు’, అని బీజేపీ నేత మరియు ఎంపీ బండి సంజయ్ పై ఆంధ్రప్రభ వార్తాపత్రిక ప్రచురించిన ఆర్టికల్ అంటూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘బండి సంజయ్ ఆస్తులపై బిజెపి అధిష్టానం ఆరా. తాజాగా గ్రానైట్ స్కాం ఆరోపణలు’, అని ఆంధ్రప్రభ వార్తాపత్రిక ప్రచురించిన ఆర్టికల్ యొక్క ఫోటో.

ఫాక్ట్: ఫోటోలోని ఆర్టికల్ ని ఆంధ్రప్రభ వార్తాపత్రిక ప్రచురించలేదు. అది ఒక ఎడిటెడ్ ఫోటో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటోలో ఉన్న ఆర్టికల్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ వార్తను ఆంధ్రప్రభ వార్తాపత్రిక వారు ప్రచురించినట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం దొరకలేదు. పోస్ట్ లోని ఫోటో 12 మార్చి నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతుంది. కాబట్టి, 12 మార్చి మరియు అంతకముందు తేదీల ఆంధ్రప్రభ వార్తాపత్రికలు వెతకగా, 11 మార్చి 2021 (ఆర్కైవ్డ్) న ఆంధ్రప్రభ లో వచ్చిన వేరే వార్తాను తీసేసి, బండి సంజయ్ కి సంబంధించిన ఫేక్ ఆర్టికల్ ని ఎడిట్ చేసి పెట్టినట్టు తెలిసింది.  పోస్ట్ లోని ఫోటోలో ఉన్న ఆర్టికల్ పక్కన మరియు ఒరిజినల్ ఆర్టికల్ పక్కన అవే పదాలు మరియు పార్లమెంట్ ఫోటో ఉన్నట్టు చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్ లోనిది కచ్చితంగా ఎడిట్ చేసిన ఫోటో అనే నిర్ధారణకు రావొచ్చు.

ఇంతకముందు, ఇతర వార్తాసంస్థల పేర్లతో బండి సంజయ్ ఆస్తుల పై వేరే ఫేక్ పోస్టులు వైరల్ అవ్వగా, అవి కూడా ఎడిట్ చేసినవి అని FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

తన పై వస్తున్న అసత్య ప్రచారాల పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘బండి సంజయ్ ఆస్తులపై బిజెపి అధిష్టానం ఆరా’, అని ఆంధ్రప్రభ ప్రచురించినట్టు ఉన్నది ఒక ఎడిటెడ్ ఫోటో.

Share.

Comments are closed.

scroll