అమెరికా డబ్బుతో చైనా ఎదుగుతోందని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు

భారతదేశ డబ్బుతో చైనా ఎదుగుతోందని, అది ప్రపంచానికి ప్రమాదకరం అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : డోనాల్డ్ ట్రంప్: ‘చైనా భారత్ డబ్బుతో ఎదుగుతోంది. ఇది ప్రపంచానికి ప్రమాదకరం’.

ఫాక్ట్ (నిజం): అమెరికా డబ్బుతో చైనా ఎదుగుతోందని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు, భారత్ డబ్బుతో కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.   

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘Donald Trump says China growing with India money’ వెతకగా, భారతదేశ డబ్బుతో చైనా ఎదుగుతోందని ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. కానీ, ‘చైనా ప్రపంచానికి ప్రమాదం’ అని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్టుగా కొన్ని వార్తా పత్రికలు ప్రచురించిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. ఈ విషయం పై ‘ఇండియా టుడే’ ప్రచురించిన ఒక ఆర్టికల్ ద్వారా ‘అమెరికా డబ్బుతో చైనా ఎదుగుతోంది’ అని డోనాల్డ్ ట్రంప్ అన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, కొన్ని దేశాలతో వ్యాపారం చేయకుండా ఉండడంలో జపాన్ ని చూసి ఇండియా నేర్చుకోవాలి అని ట్రంప్ అన్నట్టుగా కూడా ఎక్కడా కూడా సమాచారం లేదు.

చివరగా, అమెరికా డబ్బుతో చైనా ఎదుగుతోందని డోనాల్డ్ ట్రంప్ అన్నాడు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?