ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో 50 మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించలేదు

09 నవంబర్ 2025న ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెహ్రాడూన్‌లోని  ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఉత్తరాఖండ్‌లోని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షలలో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులను వేస్తామని ప్రకటించినట్లు చెప్తూ ఉన్న ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 09 నవంబర్ 2025న ​​ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించింది.

ఫాక్ట్(నిజం): ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించలేదు. దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) యొక్క ఫ్యాక్ట్-చెక్ యూనిట్, ఈ వార్తలో నిజం లేదని సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్పష్టం చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.

08 నవంబర్ 2025న, దేవ్ భూమి ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయం వారి అధికారిక ఫేస్‌బుక్ పేజీలో, 09 నవంబర్ 2025న ​​డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో  జరిగే ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, వైరల్ సర్క్యులర్ ఫేక్  అని స్పష్టం చేసింది. అంతే కాదు, వైరల్ అయిన ఫేక్ సర్కులర్ లో తేదీ కానీ, సంబంధిత యూనివర్సిటీ అధికారి సంతకం కానీ లేవు.

అంతేకాకుండా, 08 నవంబర్ 2025న, ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించినట్లు వచ్చిన వార్త నిజం కాదని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) యొక్క ఫ్యాక్ట్-చెక్ విభాగం X (ట్విట్టర్)లో స్పష్టం చేసింది.

ఈ వైరల్ వార్తాపత్రిక క్లిప్పింగ్ ఏ మీడియా సంస్థకు చెందినదో మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినా, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా ఈ వైరల్ వాదన పూర్తిగా నకిలీదని మేము చెప్పగలం.

చివరిగా, ఉత్తరాఖండ్‌లో ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో 50 మార్కులు ఇస్తామని దేవ్ భూమి విశ్వవిద్యాలయం ప్రకటించలేదు.