ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా, జాతి వివక్ష తో దక్షిణ ఆఫ్రికాలో గాంధీ ని రైలు నుండి దింపేసారు

YouTube Poster

జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లో ఎక్కినందుకు దక్షిణ ఆఫ్రికాలో మహాత్మా గాంధీని రైలు నుండి టికెట్ కలెక్టర్ దింపేసాడని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లో ఎక్కినందుకు దక్షిణ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ ని రైలు నుండి టికెట్ కలెక్టర్ దింపేసాడు.

ఫాక్ట్: 1893 లో డర్బన్ నుంచి ప్రిటోరియా కి రైలు లో వెళ్తున్నప్పుడు గాంధీ కూర్చున్న కంపార్ట్మెంట్ ‘తెల్ల జాతి’ వారిదని, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా గాంధీని పీటర్‌మరిట్జ్‌బర్గ్ స్టేషన్ లో రైలు నుండి దింపేసారు. జాతి వివక్ష కారణంగా ఆ ఘటన జరిగింది; ఫస్ట్ క్లాస్ టికెట్ గురించి కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి వెతకగా, 1893 లో డర్బన్ నుంచి ప్రిటోరియాకి రైలు లో వెళ్తున్నప్పుడు పీటర్‌మరిట్జ్‌బర్గ్ (దక్షిణ ఆఫ్రికా) స్టేషన్ లో జాతి వివక్ష తో గాంధీ ని రైల్లో నుండి బయటకు నెట్టేసినట్టు తెలిసింది. గాంధీ కూర్చున్న కంపార్ట్మెంట్ ‘తెల్ల జాతి’ వారిదని, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా గాంధీ ని రైలు నుండి దింపేసారు. ‘Mahatma Gandhi A Chronology (Publication Division)’ పుస్తకంలో ఇదే విషయం రాసి ఉన్నట్టు ఇక్కడ చదవొచ్చు.

అంతేకాదు, ఈ ఘటన గురించి ‘The Story of My Experiments with Truth’ లో గాంధీ రాస్తూ, తన దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉందని చెప్పినట్టు ఇక్కడ చదవొచ్చు.

1893 ఘటన గాంధీ జీవితాన్ని మార్చేసిందని, జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడని ప్రస్తుతం పీటర్‌మరిట్జ్‌బర్గ్ స్టేషన్ లో ఉన్న శిలాఫలకం పై రాసి ఉన్నట్టు చూడవొచ్చు.

చివరగా, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా, జాతి వివక్ష తో దక్షిణ ఆఫ్రికాలో గాంధీ ని రైలు నుండి దింపేసారు.