త్రిపుర కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఎం 45 సీట్లు గెలుచుకుంది 2015లో; 2021లో ఒక్క సీటు కూడా గెలవలేదు

త్రిపుర కార్పొరేషన్ ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 49 సీట్లకు గాను 45 గెలుచుకుందని  ఒక పోస్టు ప్రచారంలో ఉంది. అందులో ఎంత మేరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: త్రిపుర కార్పొరేషన్ ఎన్నికలలో సీపీఎం 49 సీట్లలో 45 గెలుచుకుంది.

ఫ్యాక్ట్ (నిజం): అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2015లో జరిగినప్పుడు వామపక్ష కూటమి 49 సీట్లలో 45 గెలుచుకుంది. కానీ, 2021 ఎన్నికలలో 51 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవలేదు. పాత ఎన్నికల ఫలితాలను ఇప్పుడు ప్రచారం చేయడం వల్ల ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

త్రిపుర రాష్ట్రంలో ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. దాని పేరు అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్. 2015లో అక్కడ జరిగిన అగర్తలా కార్పొరేషన్ ఎన్నికలలో ఇతర వామపక్ష పార్టీలతో కలిసి సీపీఎం 49 సీట్లకి గాను 45 గెలుచుకుంది.

అయితే 2021లో, ఇదే కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికలలో మొత్తం 51 సీట్లని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది.

చివరగా, త్రిపుర కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఎం 45 సీట్లు గెలుచుకుంది 2015లో; 2021లో ఒక్క సీటు కూడా గెలవలేదు.