Fake News, Telugu
 

ఒకటి కన్నా ఎక్కువ పథకాల లబ్దిదారులని విడివిడిగా పలు సార్లు లెక్కించే సరికి వారి సంఖ్య రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ అనిపిస్తుంది

0

ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న వివిధ పథకాల లబ్దిదారుల వివరాలను చూపిస్తూ, 5 కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభాకి 6.54 కోట్ల ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారని, రాష్ట్ర జనాభా కన్నా లబ్దిదారులే ఎక్కువని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 5 కోట్లు ఆంధ్రప్రదేశ్ జనాభాకి 6.54 కోట్ల ప్రభుత్వ పథకాల లబ్దిదారులు ఉన్నారని, రాష్ట్ర జనాభా కన్నా లబ్దిదారులే ఎక్కువ.

ఫాక్ట్ (నిజం): ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ పథకాల కింద లబ్ది పొందినప్పుడు అతనిని లబ్ది పొందుతున్న పలు పథకాల కింద ఒకటి కన్న ఎక్కువ సార్లు లెక్కించడంతో మొత్తం లబ్దిదారుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ వచ్చింది. ఉదాహారణకి వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకాలను పరిగణలోకి తీసుకుంటే, ఒకే వ్యక్తి ఈ మూడు పథకాల కింద లబ్ధి పొందొచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని ఈ మూడు పథకాలలో లబ్ధిదారుడిగా విడివిడిగా మూడుసార్లు లెక్కిస్తారు. ఇలా లెక్కించడం వల్ల లబ్దిదారుల సంఖ్య ఎక్కువగా అనిపిస్తుంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్లలో ప్రభుత్వ పథకాల రూపంలో 6,53,12,534 మంది లభ్దిదారులకు లక్ష కోట్ల నగదు బదిలీ జరిగిందని 24 జూలై 2021న సాక్షి పేపర్ లో ఒక కథనం ప్రచురితమైంది. పోస్టులో చెప్తున్న వివరాలు ఈ కథనం నుండి సేకరించినవే.

ఈ కథనంలో పేర్కొన్న మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ ఉన్న మాట నిజమైనప్పటికీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, చాలా మంది వివిధ (ఒకటి కన్నా ఎక్కువ) ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతుండడంతో వీరిని పలు పథకాల కింద ఒకటి కన్నా ఎక్కువ సార్లు లెక్కించడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ వచ్చింది.

ఉదాహారణకి పై కథనంలో పేర్కొన్న  వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకాలను పరిగణలోకి తీసుకుంటే ఒకే వ్యక్తి ఈ మూడు పథకాల కింద లభ్ది పొందొచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని ఈ మూడు పథకాలలో లబ్ధిదారుడిగా విడివిడిగా మూడుసార్లు లెక్కిస్తారు. ఇలా చాలా మందిని వివిధ పథకాల కింద ఒకటి కన్నా ఎక్కువ సార్లు క్యుములేటివ్ గా లెక్కించడంతో  లబ్ధిదారుల మొత్తం సంఖ్య రాష్ట్ర జనాభా కన్న ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్సార్ పెన్షన్ పొందుతున్న వారు  వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కూడా పొందుతూ ఉండొచ్చు, అప్పుడు వీరిని రెండు పథకాలలో విడివిడిగా రెండు సార్లు లెక్కిస్తారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు పంపణీ చేస్తామని పేర్కొంది. అదేవిధంగా ఇంకో పక్క ప్రజల ఆరోగ్య విషయానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ పథకం కింద 65 కోట్ల మందికి లబ్ది చేకురుస్తామని చెప్తుంది. ఈ రెండు పథకాల లబ్దిదారులను కలిపితే 145 కోట్ల మంది అవుతున్నారు, ఇది మన దేశ జనాభా కన్నా ఎక్కువ. అంటే దీని అర్ధం దేశ జనాభా కన్నా ఈ పథకాల లబ్ధిదారుల ఎక్కువున్నారని కాదు. రెండు పథకాలలో లబ్ధి పొందుతున్న వారిని విడిగా రెండుసార్లు లెక్కించారని.

చివరగా, ఒకటి కన్నా ఎక్కువ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారిని విడివిడిగా పలు సార్లు లెక్కించే సరికి మొత్తం లబ్ధిదారుల సంఖ్య రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ అనిపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll