1950లో జరిగిన కొరియన్ యుద్దంలో మరణించిన చైనా సైనికుల శవపేటికల ఫోటోలని గల్వాన్ ఘర్షణలవి అంటూ షేర్ చేస్తున్నారు

గల్వాన్ వ్యాలిలో జరిగిన ఘర్షణలో ఒక్కో భారత సైనికుడు 30 మంది చైనా సైనికులను హతమార్చారు, అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ పెట్టిన  పోస్ట్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరణించిన సైనికుల శవపేటికలను చైనా సైనికులు తీసుకువస్తున్న ఫోటోలు, భారత్ తో జరిగిన యుద్దంలో చైనా ఓడిపోయినట్టు రాసి వున్న ఆర్టికల్ ఫోటోలు, ఈ పోస్టులో షేర్ చేసారు. వీటిల్లో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత్ తో జరిగిన యుద్దంలో చనిపోయిన చైనా సైనికుల శవపేటికల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ): శవపేటికలతో ఉన్న ఫోటోలు పాతవి. గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్శణలకి సంభందించినవి కావు. 1950లో జరిగిన కొరియన్ యుద్దంలో మరణించిన ‘Chinese People’s Volunteer Army’ సైనికుల శవపేటికలు అవి. భారత్ తో యుద్దంలో చైనా ఓడిందంటు షేర్ చేస్తున్న ఆర్టికల్ కూడా ఫోటోషాప్ చేయబడింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటో 1:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయగా, ‘The State Council of the People’s Republic of China’ రిలీజ్  చేసిన ఒక ఆర్టికల్ లో ఈ ఫోటో దొరికింది. 1950లో జరిగిన కొరియన్ యుద్దంలో మరణించిన ‘Chinese People’s Volunteer Army’ సైనికుల శవపేటికలు అవి, అని తెలిసింది. 2016లో ఈ శవపేటికలని Republic of Korea (ROK) చైనా కు అప్పగించగా, వాటి ఖననం చేసే ముందు చేసిన కార్యక్రమంలో తీసిన ఫోటో ఇది.

 ఫోటోలు 2 మరియు 3:

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ‘Xinhua News Agency’ అనే చైనీస్ న్యూస్ పోర్టల్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో ఈ ఫోటోలు దొరికాయి. ఆర్టికల్ లోని ఈ ఫోటోలు మనం ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలు కూడా మొదటి ఫోటోలో చెప్పినట్టు కొరియన్ యుద్దంలో చనిపోయిన చైనా సైనికుల శవపేటికలకు సంభందినవే కాని, 2019 లో జరిగిన కార్యక్రమానికి సంభందించినవి.

ఫోటో-4:

పోస్టులో షేర్ చేసిన ఈ ఆర్టికల్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ‘China Military Online’ అనే చైనీస్ మిలిటరీ వెబ్సైటులో ఈ ఆర్టికల్ దొరికింది. అయితే ఈ ఆర్టికల్ లో ఉన్న కొంత బాగాన్ని ఎడిట్ చేసి భారత్ తో యుద్దంలో చైనా ఓడిపోయింది అంటూ షేర్ చేస్తున్నారు. అలాగే ఈ ట్వీట్ పోస్ట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ కోసం సెర్చ్ చేయగా, ఆ అకౌంట్ వివరణలో ఇది ఒక పేరడీ అకౌంట్ అని రాసినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు.

చివరగా, 1950లో జరిగిన కొరియన్ యుద్దంలో మరణించిన చైనా సైనికుల శవపేటికల ఫోటోలని, గల్వాన్ ఘర్షణలలో చనిపోయిన చైనా సైనికులవంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?