చిలీ దేశంలో జరిగిన నిరసన ప్రదర్శన వీడియో పెట్టి, ‘జనసేన లాంగ్ మార్చ్ ఏరియల్ వ్యూ’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన ‘లాంగ్ మార్చ్’ యొక్క ఏరియల్ వ్యూ అంటూ ఒక వీడియోని కొందరు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జనసేన ‘లాంగ్ మార్చ్’ ఏరియల్ వ్యూ వీడియో

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన వీడియో చిలీ దేశంలో గత నెల జరిగిన ఒక నిరసన ప్రదర్శన కి సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ వీడియోల వివరణలో అవి చిలీ దేశానికి సంబంధించిన వీడియోలని రాసి ఉంటుంది. పోస్టులోని వీడియో కూడా చిలీ దేశంలో గత నెలలో జరిగిన నిరసన ప్రదర్శన కి సంబంధించినదని ‘Democracy Now’ అనే వెబ్ సైట్ లో చూడవొచ్చు. చిలీ లో జరిగిన నిరసన ప్రదర్శన గురించి BBC వారు పెట్టిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, చిలీ దేశంలో జరిగిన నిరసన ప్రదర్శన వీడియో పెట్టి, “జనసేన ‘లాంగ్ మార్చ్’ ఏరియల్ వ్యూ” అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?