ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వారి స్థానంలో తాత్కాలిక డ్రైవర్లను నియమించింది. తాత్కాలిక డ్రైవర్ వల్ల RTC బస్సు అదుపు తప్పి రోడ్డు క్రిందకి వెళ్లిందంటు ఒక వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: తాత్కాలిక డ్రైవర్ వల్ల RTC బస్సు అదుపు తప్పి రోడ్డు క్రిందకి వెళ్లింది
ఫాక్ట్ (నిజం): ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలవ్వక ముందు జరిగిన ఘటనకి సంబంధించిన వీడియోని పెట్టి, తాత్కాలిక డ్రైవర్ వల్ల ఆక్సిడెంట్ జరిగినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని కామెంట్స్ విభాగంలో, ఒక వ్యక్తి ఆ వీడియోలోని ఘటన నెల క్రితం మెదక్ జిల్లాలో జరిగిందని అందుకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ని పెట్టాడు. ఆ సమాచారంతో ‘ఈనాడు’ మెదక్ జిల్లా ఎడిషన్ వార్తల్లో వెతకగా, పోస్ట్ లోని వీడియోలో కనిపించే ఘటనకి సంబంధించిన ఫోటో సెప్టెంబర్ 20న మెదక్ జిల్లా కొల్చాపురం మండలం కిష్టాపూర్ లో జరిగిన ఆక్సిడెంట్ కి సంబంధించి ప్రచురితమైన కథనం లో లభించింది.
కొన్ని యూట్యూబ్ వార్తా ఛానెల్ల ద్వారా కూడా ఆ ఘటన సెప్టెంబర్ 19న జరిగినట్లుగా తెలుసుకోవచ్చు. ఆ న్యూస్ వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టింది అక్టోబర్ 4 అర్థరాత్రి నుంచి. అంటే, ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టకముందు ఈ ఆక్సిడెంట్ జరిగింది.
కావున, పోస్టులో పేర్కొన్నట్లు వీడియోలోని ఆక్సిడెంట్ తాత్కాలిక డ్రైవర్ వల్ల జరగలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియోలోని ఆక్సిడెంట్ తాత్కాలిక డ్రైవర్ వల్ల జరగలేదు - Fact Checking Tools | Factbase.us