Fake News, Telugu
 

దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ అనలేదు

0

దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని బీజేపీ ఎంపీ మరియు ప్రముఖ నటుడు రవి కిషన్ అన్నారని ఒక పోస్ట్ మరియు వీడియో (ఇక్కడ మరియు ఇక్కడ) ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని బీజేపీ ఎంపీ రవి కిషన్ అన్నాడు; దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో కనీసం 17 మే 2020 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతోంది. కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికుల దయనీయమైన చిత్రాల మధ్య వారిని ఉద్దేశించి రవి కిషన్ ఈ వ్యాఖ్యలు చేసారని వైరల్ అయినప్పుడు, ఈ వీడియో 2017 ఎన్నికల సమయం నాటిదని రవి కిషన్ క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఇటీవల రవి కిషన్ దళితులతో కూర్చొని భోజనం చేయటాన్ని ఫోటోలతో తనే ట్వీట్ చేసారు. బీజేపి వారికి ఒక గ్లాస్, దళితులకు ఒక గ్లాస్ వాడారని తప్పుపడుతూ సోషల్ మీడియాలో రవి కిషన్ ను ఉద్దేశించి బాగా షేర్ చేసారు. ఈ వీడియో కూడా ఆ నేపధ్యంలో బాగా షేర్ అయ్యింది. కానీ, దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని రవి కిషన్ అన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న వీడియో యూట్యూబ్‌లో లభించింది. లైవ్ హిందుస్తాన్ తమ యూట్యూబ్‌ ఛానల్‌లో 17 మే 2020లోనే ఈ వీడియోను అప్లోడ్ చేసినట్టు తెలుస్తుంది. కరోనా లాక్ డౌన్ లో వలస కార్మికుల దయనీయమైన చిత్రాల మధ్య ఎంపీ రవి కిషన్ యొక్క ఈ పాత వీడియో వైరల్ అయిందని, వైరల్ అయిన వీడియో 2017 ఎన్నికల సమయం నాటిదని రవి కిషన్ తానే వీడియో ద్వారా క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో తన స్టాఫ్ తో మాట్లాడుతున్నప్పుడు తీసిందని, వెరెవరినీ ఉద్దేశించి కాదని తెలిపారు. దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని రవి కిషన్ ఎక్కడా కూడా అనలేదు.

ఇటీవల రవి కిషన్ దళితులతో కూర్చొని భోజనం చేయటాన్ని ఫోటోలతో తనే ట్వీట్ చేసారు. బీజేపి వారికి ఒక గ్లాస్, దళితులకు ఒక గ్లాస్ వాడారని తప్పుపడుతూ సోషల్ మీడియాలో రవి కిషన్ ను ఉద్దేశించి బాగా షేర్ చేసారు. ఈ వీడియో కూడా ఆ నేపధ్యంలో బాగా షేర్ అయ్యింది. కానీ, దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని బీజేపీ ఎంపి రవి కిషన్ అన్నట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

చివరగా, దళితుల శరీరం నుండి దుర్వాసన వస్తుందని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు రవి కిషన్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll