వీడియోలో బీజేపీ వారు తమ పార్టీ జెండాని ఎగరవేసింది జెండా వందన కార్యక్రమంలో కాదు

జాతీయ గీతం బ్యాక్ గ్రౌండ్ లో వస్తుండగా బీజేపీ వారు తమ పార్టీ జెండాని ఎగరవేస్తున్న వీడియో ని గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఫేస్బుక్ లో పోస్టు చేసి, ఆ ఘటన జెండా వందన కార్యక్రమంలో జరిగిందని దాని గురించి చెప్తున్నారు. పోస్టులో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జెండా వందన కార్యక్రమంలో బీజేపీ వారు తమ పార్టీ జెండాని ఎగరవేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో బీజేపీ వారు తమ పార్టీ జెండాని ఎగరవేసింది జెండా వందన కార్యక్రమంలో కాదు. ఆ ఘటన, మధ్య ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పని చేసినప్పుడు, ‘పంచాయత్ ఛలో’ కార్యక్రమ ప్రచార సభలో జరిగింది. ఆ కార్యక్రమం ఛత్తార్పూర్ జిల్లా రాజ్ నగర్ లో మే 15, 2018 న జరిగింది. కావున, పోస్టు తప్పుద్రోవ పట్టించేలా ఉంది.

పోస్టులోని కామెంట్స్ విభాగంలో ఒకరు ఆ వీడియో గురించి పేర్కొన్నది తప్పని చెప్పి, అదే వీడియోకి సంబంధించిన యూట్యూబ్ లింక్ ని పెట్టాడు.

వీడియో కి టైటిల్ ‘Shivraj singh chouhan National anthem recited after hoisting BJP flag’ అని ఉంది మరియు దానిని మే 16, 2018 న యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లుగా ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఆ ఘటన ఛత్తార్పూర్ జిల్లా (మధ్య ప్రదేశ్) రాజ్ నగర్ లో ‘పంచాయత్ ఛలో’ కార్యక్రమ ప్రచార సభలో జరిగిందని ఉంది. ఆ సమాచారం తో వెతికినప్పుడు, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ న్యూస్ రిపోర్ట్స్ లభించాయి. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

కావున, వీడియోలో బీజేపీ వారు తమ పార్టీ జెండాని ఎగరవేసింది జెండా వందన కార్యక్రమంలో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?