‘వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్’ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు

దేశ వ్యాప్తంగా ఈ నెలలో 6 రోజులు వరుసగా బ్యాంకులు బంద్ కానున్నాయి అంటూ కొందరు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్ : సెప్టెంబర్ 26 నుంచి వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.

ఫాక్ట్ (నిజం): సెప్టెంబర్ 26 మరియు 27 తేదీలలో నాలుగు యూనియన్స్ పిలుపునిచ్చిన సమ్మె లో అందరూ పాల్గొనట్లేదు మరియు బ్యాంకులకు ఆర్ధవార్షిక క్లోజ్ రోజు సెలవు ఏమి ఉండదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

నాలుగు బ్యాంకు యూనియన్స్ సెప్టెంబర్ 25 అర్థరాత్రి నుంచి సెప్టెంబర్ 27 అర్థరాత్రి వరకు, ఆర్ధిక మంత్రి ఆగస్టు 30న ప్రకటించిన పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల విలీనానికి నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చిన విషయం వాస్తవమే అయినా, అన్ని బ్యాంకుల ఉద్యోగులు అందులో పాల్గొనకపోవొచ్చు. ప్రైవేటు బ్యాంకులు యధావిధిగా పనిచేయవొచ్చు.

ఈ సమ్మె విషయాన్ని అంగీకరిస్తూ స్టేట్ బ్యాంకు వారు బ్యాంకులు యధావిధిగా పని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అని చెప్తూ, బ్యాంకుకి సంబంధించిన పనుల పై సమ్మె ప్రభావం కొంత ఉండొచ్చు అని అన్నారు.

సెప్టెంబర్ 28 నాలుగో శనివారం మరియు 29వ తేదీ ఆదివారం వళ్ళ బ్యాంకులకు సెలవు అయినా కూడా సెప్టెంబర్ 30న ఏ బ్యాంకులకు సెలవు లేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న వార్షిక సంవత్సరం క్లోజ్ సందర్భంగా అన్ని బ్యాంకులకు సెలవు కాగా, అర్థవార్షిక సంవత్సరం క్లోజ్ సందర్భంగా ఏ బ్యాంకుకి సెలవు ఉండదు. కావున సెప్టెంబర్ 30న అన్ని బ్యాంకులు పని చేస్తాయి. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న అందరికి సెలవు.

చివరగా, సెప్టెంబర్ 26, 27న ప్రకటించిన సమ్మె వాళ్ళ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల పై ప్రభావం పడిన, పోస్టులో చెప్పినట్టు అన్ని బ్యాంకులకు వరుసగా 6 రోజులు సెలవు లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?