బీజేపీ నాయకురాలు ఉమాభారతి ప్రధాని నరేంద్ర మోదీని ‘వినాష్ పురుష్’ లేదా విధ్వంసకుడిగా ఇటీవల పేర్కొన్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) చక్కర్లు కొడుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకుందాం.
క్లెయిమ్: బీజేపీ నాయకురాలు ఉమాభారతి ఇటీవల ఒక విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ‘వినాష్ పురుష్’ లేదా ‘విధ్వంసకుడు’ అని అన్నారు.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో ఇటీవలిది కాదు. వార్తా కథనాల ప్రకారం ఇది ఉమాభారతి భారతీయ జనతా పార్టీలో భాగం కాని కాలం నాటిది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ క్లైయిమ్‌ని ధృవీకరించడానికి మొదటగా మేము వీడియో గురించి ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా మాకు 2014 సంవత్సరం నాటి కొన్ని వార్తా కథనాలు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 2014లో సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఈ వీడియోలో బీజేపీ నాయకురాలు ఉమాభారతి నరేంద్ర మోదీని ‘వినాష్ పురుష్’ అని సంబోధించడం మనం చూడవచ్చు
అయితే, ఉమాభారతి భారతీయ జనతా పార్టీలో భాగం కాని దశలో ఈ వీడియో రికార్డ్ చేయబడింది అని కాంగ్రెస్ పార్టీ 2014లో చెప్పింది. అంటే, ఆ సమయంలో ఆమె బీజేపీ సభ్యురాలు కారు అని దీని అర్థం. క్రమశిక్షణారాహిత్యం మరియు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా 2005లో ఆమెను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. తను 2011లో తిరిగి బీజేపీలో చేరారు.
2014లో Rediff.comలో వచ్చిన ఒక వార్తా కథనం ప్రకారం, ఈ వీడియో కాంగ్రెస్ పార్టీ (ఇక్కడ మరియు ఇక్కడ) విడుదల చేసినప్పుడు మూడు సంవత్సరాల పాతది(అప్పటికి). ఆమె ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆమె బీజేపీతో విడిపోయి“భారతీయ జనశక్తి పార్టీ” అనే పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.
2014లో ఈ వీడియో మళ్లీ తెరపైకి వచ్చినప్పుడు, ఉమాభారతి వీడియోను విడుదల చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేసింది. 2014లో NDTVలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, పార్టీ నుండి ఆమెను బహిష్కరించిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.
చివరిగా, ఉమాభారతి ప్రధాని మోదీని విమర్శిస్తున్న ఈ వీడియో ఇప్పటిది కాదు.